ETV Bharat / international

'అమెరికా నమ్మక ద్రోహం- భారత్​పై గూఢచర్యం!'

భారత్​ సహా పలు దేశాల గూఢచారులు, సైన్యం, దౌత్య రహస్యాలను 5 దశాబ్దాలుగా అమెరికా ఛేదిస్తోందని ఓ నివేదిక వెల్లడించింది. స్విట్జర్లాండ్​కు చెందిన భాగస్వామ్య సంస్థ సాయంతో అమెరికా కేంద్ర నిఘా సంస్థ ఈ సమాచార దోపిడీకి పాల్పడినట్లు రెండు వార్తా సంస్థలు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్​లో బయటపడింది.

US-CIA-SPYING
ప్రపంచ దేశాలపై అమెరికా నిఘా
author img

By

Published : Feb 12, 2020, 7:08 PM IST

Updated : Mar 1, 2020, 3:02 AM IST

భారత్​ సహా పలు దేశాల కీలక సమాచారాలను అమెరికా కేంద్ర నిఘా సంస్థ (సీఐఏ) దశాబ్దాలుగా సేకరిస్తోందని ఓ అమెరికన్ వార్తాపత్రిక ఆరోపించింది. స్విట్జర్లాండ్​కు చెందిన ఓ కంపెనీ సాయంతో వివిధ దేశాల రహస్య సందేశాలను అమెరికా చదువుతోందని తెలిపింది.

అనుసంధానం, సమాచార భద్రత కోసం క్రిప్టో ఏజీని 1940లో స్థాపించారు. తమ గూఢచారులు, సైనికులు, దౌత్య రహస్యాలను కాపాడేందుకు ఈ సంస్థ సేవలను చాలా దేశాల ప్రభుత్వాలు పొందుతున్నాయి. ఆయా రంగాల్లో సమాచారం కోసం వాడే కోడ్​ సందేశాలను ఇతర దేశాలు చూడకుండా ఈ సంస్థ అడ్డుకుంటుంది. కానీ... ఈ సంస్థ ద్వారానే అమెరికా గూఢచర్యం సాగిస్తుందన్నది ప్రధాన ఆరోపణ.

అమెరికా సమాచార దోపిడీకి సంబంధించి వాషింగ్టన్​ పోస్ట్​తో పాటు జర్మన్​ పబ్లిక్​ బ్రాడ్​కాస్టర్​-జడ్​డీఎఫ్​ సంయుక్త ఆపరేషన్​ చేపట్టాయి. 1951లో క్రిప్టో ఏజీ అనే సంస్థతో సీఐఏ ఒప్పందం కుదుర్చుకుందని.. 70వ దశకంలో పూర్తి యాజమాన్య హక్కులు వచ్చాయని ఈ నివేదికలు వెల్లడించాయి.

"ఈ శతాబ్దంలో ఇది అతిపెద్ద నిఘా కుట్ర. అమెరికా, పశ్చిమ జర్మనీలకు తమ రహస్యాలు బయటకు రాకుండా విదేశీ ప్రభుత్వాలు చాలా మొత్తాన్ని చెల్లిస్తున్నాయి."

- నివేదిక

సంయుక్త ఆపరేషన్​లో బయటపడిన వాస్తవాలు..

  1. వివిధ దేశాల నుంచి సేకరించిన రహస్య సమాచారంతో.. అమెరికాతో పాటు దాని మిత్ర దేశాలు లబ్ధి పొందాయి. ఏళ్లుగా ఆయా దేశాల్లో డబ్బు, రహస్యాల దోపిడీకి పాల్పడ్డాయి.
  2. క్రిఫ్టోగ్రఫీ సాయంతో అమెరికా మిత్రదేశాలపైనా సీఐఏ సహా జాతీయ భద్రత సంస్థ నిఘా పెట్టింది.
  3. అర్ధ శతాబ్దానికిపైగా చాలా దేశాలు ఈ స్విట్జర్లాండ్​ కంపెనీని నమ్ముతూ వస్తున్నాయి. ఈ సంస్థ సేవలను భారత్​, పాకిస్థాన్​, ఇరాన్​, లాటిన్​ అమెరికా, వాటికన్​ తదితర దేశాలు వినియోగిస్తున్నాయి.

ఈ సంస్థతో అమెరికాకు భాగస్వామ్యం ఉన్నట్లు వినియోగదారులకు ఏమాత్రం తెలియదని నివేదిక తెలిపింది.

అయితే దీనిపై భారత ప్రభుత్వం ఇంకా స్పందించలేదు.

Last Updated : Mar 1, 2020, 3:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.