ETV Bharat / international

భారత్​ను చైనా బెదిరించాలని చూస్తోంది- అమెరికా

భారత సరిహద్దు ప్రాంతాల్లో వాస్తవాధీన రేఖ వెంబడి చైనా తన అదనపు బలగాలను మోహరిస్తోంది. దీనిపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం, దౌత్య మార్గాల ద్వారా సరిహద్దు సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించింది.

Chinese forces moved up to north of India along LAC, says Pompeo
చైనా దూకుడు తగ్గించుకుంటే మంచిది: అమెరికా
author img

By

Published : Jun 2, 2020, 10:37 AM IST

భారత్​ -చైనా సరిహద్దు వివాదంలో బీజింగ్​ ప్రదర్శిస్తున్న దూకుడుపై అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం వివాదాన్ని పరిష్కరించుకోకుండా చైనా పొరుగుదేశాన్ని బెదిరించాలని చూస్తోందని అగ్రహం వ్యక్తం చేసింది.

"భారత్​ను బెదిరించేలా వాస్తవాధీన రేఖ వెంబడి చైనా తన బలగాలను మోహరిస్తోంది. అసలు అక్కడ ఏం జరుగుతోంది."

- మైక్ పాంపియో, అమెరికా విదేశాంగమంత్రి

"భారత్​-చైనాల సరిహద్దు వివాదాలను అంతర్జాతీయ నిబంధనలు పాటిస్తూ దౌత్య మార్గాలు, ఇతర యంత్రాంగాల ద్వారా పరిష్కరించుకోవాలని చైనాను కోరుతున్నాం."

- ఇల్లాయిట్ ఇంజెల్, అమెరికా ప్రతినిధుల సభకు చెందిన విదేశీ వ్యవహారాల సంఘం ఛైర్మన్‌

నివురుగప్పిన నిప్పులా..

కొద్దిరోజుల కిందట తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్‌, సిక్కింలో భారత్‌, చైనా సైనికులు రాళ్లు, ఇనపకడ్డీలతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణల్లో ఇరు దేశాలకు చెందిన అనేక మంది జవాన్లు గాయపడ్డారు. అప్పట్నుంచి లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి పరిస్థితి నివురు గప్పిన నిప్పులా మారింది. గాల్వాన్‌ లోయ, దెమ్‌చోక్‌, దౌలత్‌ బేగ్‌ ఓల్డీ వంటి సున్నిత ప్రాంతాలకూ ఉద్రిక్తతలు పాకాయి. రెండు దేశాలు భారీగా బలగాలను మోహరిస్తున్నాయి.

ఇదీ చూడండి: చైనాపై అమెరికాలో వ్యాజ్యాలు.. వృథాప్రయాసేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.