ETV Bharat / international

4 దశాబ్దాల తర్వాత ఆ చైనా కాన్సులేట్​ మూసివేత - Houston

అమెరికా హ్యూస్టన్​లోని చైనా రాయబార కార్యాలయం నాలుగు దశాబ్దాల తర్వాత అధికారికంగా మూతపడింది. కార్యాలయం ముందు పీపుల్స్​ రిపబ్లిక్​ ఆఫ్​ చైనా ముద్ర, జెండాను తొలగించి, భవనాన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఈ సందర్భంగా పలువురు చైనా వ్యతిరేక ఆందోళనకారులు సంబరాలు చేసుకున్నారు.

Chinese consulate in Houston
4 దశాబ్దాల తర్వాత హ్యూస్టన్​లోని చైనా కాన్సులేట్​ మూత
author img

By

Published : Jul 25, 2020, 11:14 AM IST

అమెరికా, చైనాలా మధ్య ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకు మరింత తీవ్రమవుతున్నాయి. దేశంలోని చైనా రాయబార కార్యాలయాల మూసివేతకు పూనుకుంది అమెరికా. ఇందులో భాగంగా హ్యూస్టన్​లోని కార్యాలయాన్ని మూసివేసింది. నాలుగు దశాబ్దాల తర్వాత హ్యూస్ట్​న్​లోని చైనా రాయబార కార్యాలయం అధికారికంగా మూతపడింది.

ఇటీవల ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. కరోనా వైరస్​,​ ముస్లింలపై ఆంక్షలు, హాంగ్​కాంగ్​లో జాతీయ భద్రత చట్టం అమలు నేపథ్యంలో చైనాపై ఆగ్రహం వ్యక్తం చేసింది అమెరికా. పలు ఆంక్షలకు తెరతీసింది.

హ్యూస్టన్​లో చైనా రాయబార కార్యాలయం గూఢచర్యానికి ప్రధాన కేంద్రంగా మారిందని అగ్రరాజ్యం విదేశాంగ మంత్రి మైక్​ పాంపియో ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. 72 గంటల్లో కాన్సులేట్​ను మూసివేయాలని ఆదేశించింది అమెరికా. ఈ నేపథ్యంలో కార్యాలయాన్ని మూసివేశారు.

గడువు ముగిసే సమయానికి గంట ముందు.. చైనా కాన్సులేట్​ భవనం ముందు ఉన్న పీపుల్స్​ రిపబ్లిక్​ ఆఫ్​ చైనా ముద్ర, జెండాను తొలగించారు అధికారులు. భవనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే.. తమకు చెందిన వస్తువులను కాన్సులేట్​ సిబ్బంది తొలగించటం కనిపించింది.

సంబరాలు..

దౌత్య కార్యాలయం మూసివేత నేపథ్యంలో కొంతమంది ఆందోళనకారులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు భద్రత కట్టుదిట్టం చేసి, బారీకేడ్లు ఏర్పాటు చేశారు.

చైనా ప్రతీకార చర్యలు..

హ్యూస్టన్​లోని దౌత్య కార్యాలయం మూసివేయటంపై ఆగ్రహం వ్యక్తం చేసిన చైనా.. ప్రతీకార చర్యలు చేపట్టింది. చెంగ్డూ నగరంలోని యూఎస్​ కాన్సులేట్​ను మూసివేయాలని ఆదేశించింది. జాతీయ భద్రతకు భంగం కలిగించటం సహా.. అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకుంటోందని ఆరోపించింది.

ఇదీ చూడండి: ఇక మీదట చైనాపై అవే మా విధానాలు: పాంపియో

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.