ETV Bharat / international

'అందుకే భారత్​తో చైనా కయ్యానికి కాలు దువ్వుతోంది' - China using tactical situation on ground to its advantage

క్షేత్రస్థాయిలో నెలకొన్న వ్యూహాత్మక పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకోవాలని చైనా చూస్తోందన్నారు అమెరికా విదేశాంగ మంత్రి మైక్​ పాంపియో. అందుకే భారత్ వంటి పొరుగు దేశంతో సరిహద్దు విషయంలో ఉద్రిక్తతలు పెంచుతోందన్నారు.

China using tactical situation on ground to its advantage: Pompeo
'ప్రస్తుత పరిస్థితులతో చైనా ప్రయోజనం పొందాలని చూస్తోంది'
author img

By

Published : Jun 1, 2020, 10:40 AM IST

ప్రస్తుతం నెలకొన్న అంతర్జాతీయ పరిస్థితుల ద్వారా ప్రయోజనం పొందాలని చైనా భావిస్తోందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో అన్నారు. భారత్​తో సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులే అందుకు నిదర్శనమన్నారు. చైనా వ్యవహరిస్తున్న తీరుపై ఓ న్యూస్​ ఛానెల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక విషాయాలు వెల్లడించారు పాంపియో.

చైనా బెదిరింపులకు పాల్పడుతున్న విషయం వాస్తవమేనన్నారు పాంపియో. వారు చాలా కాలంగా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారని, సమస్యలున్న ప్రతిచోటా బెదిరింపులు కూడా ఉంటాయన్నారు. 10 సంవత్సరాల క్రితం నాటి చైనా కమ్యూనిస్టు పార్టీకి, ప్రస్తుత పార్టీకి చాలా వ్యత్యాసం ఉందన్నారు పాంపియో. అధ్యక్షుడు జిన్​పింగ్ చైనా సైనిక సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.

పాశ్చాత్య ఆలోచనలు, ప్రజాస్వామ్యాలు, విలువలను నాశనం చేయాలనే ఉద్దేశంతోనే చైనా కమ్యూనిస్ట్ పార్టీ ముందుకు సాగుతోందని, ఇది అమెరికన్లను ప్రమాదంలో పడేస్తుందని పాంపియో అన్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ నేతృత్వంలో రక్షణ శాఖ, జాతీయ భద్రతా వ్యవస్థ ప్రజల్ని కాపాడగలవన్నారు. భారత్ సహా ఆస్ట్రేలియా, జపాన్, బ్రెజిల్ ​ వంటి మిత్ర దేశాలు తమకు భాగస్వాములుగా ఉన్నాయన్నారు.

ప్రస్తుతం అమెరికా కాంగ్రెస్​లో 60కి పైగా బిల్లులు ఉన్నాయని, వాటిలో ఎక్కువగా ద్వైపాక్షిక, చైనాకు వ్యతిరేక బిల్లులే అని పాంపియో చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.