ETV Bharat / international

కరోనా సోకడం నా మంచికే: ట్రంప్​ - donald trump latest news

కరోనా సోకడం దురదృష్టకరమే అయినా తనకు మంచే జరిగిందన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తనకు అందించిన చికిత్సనే అమెరికా ప్రజలందరికీ ఇవ్వాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

China to pay a 'big price' for spreading COVID-19 globally: Trump
'కరోనాను వ్యాప్తి చేసిన చైనా భారీ మూల్యం చెల్లిస్తుంది'
author img

By

Published : Oct 8, 2020, 2:22 PM IST

కరోనా వైరస్ సోకి, ఆస్పత్రి పాలవడం వల్ల తనకు అనుకోని మేలు జరిగిందని చెప్పారు అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన 2 రోజుల తర్వాత వీడియో సందేశం విడుదల చేశారు. తాను కోలుకునేందుకు ఉపయోగపడిన రీజనరాన్​ సహా ఇతర ఔషధాలను అమెరికన్లందరికీ ఉచితంగా అందిస్తామని స్పష్టంచేశారు.

"అమెరికా అధ్యక్షుడికి అందిన చికిత్సే ప్రతి ఒక్కరికీ లభించాలి. ఎందుకంటే ఇది నాకు గొప్ప అనుభూతినిచ్చింది. భగవంతుడి ఆశీర్వచనాల వల్లే నాకు కరోనా సోకింది. ఇది నాకు ఊహించని మేలు."

-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

చైనాకు హెచ్చరికలు..

కరోనాపై చైనాకు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు ట్రంప్. ప్రపంచం మొత్తానికి వైరస్​ను వ్యాపింపజేసి విపత్కర పరిస్థితికి కారణమైన డ్రాగన్​ దేశం.. భారీ మూల్యం చెల్లించక తప్పదని స్పష్టం చేశారు.

"ఈ విపత్కర పరిస్థితికి కారణం మనం కాదు. ఇది చైనా చేసిన తప్పు. అమెరికా, ప్రపంచం ఈ పరిస్థితిలో ఉండడానికి కారణమైన చైనా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇది ముమ్మాటికీ చైనా తప్పిదమే. ఇది గుర్తుంచుకోండి. "

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.