ETV Bharat / international

వాణిజ్య యుద్ధంపై చైనా మరికాస్త వెనక్కి..! - వాణిజ్య యుద్ధం

అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం సద్దుమణుగుతున్నట్లు కనిపిస్తోంది. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే సోయాబిన్​, పంది మాంసంపై సుంకాలు సడలించే దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇరు దేశాల మధ్య మరో దఫా వాణిజ్య చర్చలు జరుగనున్న నేపథ్యంలో చైనా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.

వాణిజ్య యుద్ధం
author img

By

Published : Sep 14, 2019, 9:17 AM IST

Updated : Sep 30, 2019, 1:28 PM IST

అమెరికాతో వాణిజ్య యుద్ధంపై చైనా వెనక్కి తగ్గుతుంది. ఇందులో భాగంగా సోయాబిన్​, పంది మాంసంపై ఉన్న దిగుమతి సుంకాలను తగ్గించనున్నట్లు.. చైనా వార్తా సంస్థ తెలిపింది. ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు జరగనున్న నేపథ్యంలో కొన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు తగ్గించే యోచనలో చైనా ఉన్నట్లు తెలిపింది.

'పీపుల్స్‌ రిపబ్లిక్‌ చైనా' 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సుంకాల బాదుడును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ అక్టోబర్​ 1 నుంచి 15కు వాయిదావేస్తూ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత చైనా కొన్ని అమెరికా వస్తువులను అధిక పన్నుల జాబితా నుంచి తొలగించడం, మరికొన్ని వస్తువులపై సుంకాలు తగ్గించే దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం.

తాజా పరిణామాలు..అమెరికా-చైనా మధ్య చాలా కాలంగా కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం ముగుస్తుందనే ఆశలు పెంచుతోంది. ఇరు దేశాలు తాత్కాలిక ఊరటినిచ్చే నిర్ణయాలు తీసుకున్నప్పటికీ.. వాణిజ్య యుద్ధం ముగిసినట్లు ఎలాంటి ఒప్పందం కుదరలేదు.

ఇదీ చూడండి: 'భారత ఆర్థిక పరిస్థితి మరింత దయనీయం'

New Delhi, Sep 14 (ANI): Minister of State for PMO Jitendra Singh attended an event in Delhi and addressed the public there. He said, "The greatest mistake in modern India was the partition. Gandhi ji had said that if a partition takes place, it will happen only over his dead body. He was disappointed and left for Bengal on the occasion of the first Independence Day. Had we understood that the partition took place only due to the ambitions of a few people, then the discussions on Jammu and Kashmir happening today would not have taken place. There would have neither been Article 370 nor the issue of its abrogation."He further said, "You can see how forward or backward we went, with one accident in the history. The two-nation theory, on the basis of which partition was done, proved to be meaningless the day Bangladesh was formed. "
Last Updated : Sep 30, 2019, 1:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.