భారత్, చైనాను అభివృద్ధి చెందుతోన్న దేశాలుగా పరిగణించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అంశంపై ప్రపంచ వాణిజ్య సంస్థతో కొంతకాలంగా వివాదం నడుస్తున్నట్లు ట్రంప్ తెలిపారు.
అమెరికాను డబ్ల్యూటీఓ న్యాయంగా చూడటం లేదని ట్రంప్ ఆరోపించారు. చైనా, భారత్‌ను అభివృద్ధి చెందుతోన్న దేశాలుగా డబ్ల్యూటీఓ పరిగణిస్తోందని.. తమ దేశానికి అదే హోదా ఎందుకు ఇవ్వడం లేదని ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు.
"నా దృష్టిలో అమెరికా కూడా అభివృద్ధి చెందుతోన్న దేశమే. కానీ చైనా, భారత్‌ను అభివృద్ధి చెందుతోన్న దేశాలుగా పరిగణించడం వల్ల వారు ఎన్నో అవకాశాలను, లాభాలను పొందుతున్నారు. మమ్మల్ని అలా చూడటం లేదు. వాళ్లని అభివృద్ధి చెందుతోన్న దేశాలుగా చూడకూడదు. వాళ్లని అలా చూస్తే మమ్మల్ని చూడాల్సిందే." - డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
- ఇదీ చూడండి: భారీ అగ్నిప్రమాదం.. 100కు పైగా పాకలు దగ్ధం