ETV Bharat / international

'ఉద్రిక్తతలు పెంచేందుకే చైనా క్షిపణి ప్రయోగాలు'

దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ దేశం సైనిక విన్యాసాలను ఉద్ధృతం చేసినట్లు అమెరికా తెలిపింది. నౌకాదళ విన్యాసాల్లో భాగంగా నాలుగు మధ్య తరహా బాలిస్టిక్ క్షిపణులను చైనా ప్రయోగించినట్లు పేర్కొంది. దీని ద్వారా దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో మరింత అస్థిరత్వం నెలకొంటుందని అగ్రరాజ్యం తెలిపింది.

China has escalated its exercise activities by firing ballistic missiles in South China Sea, says Pentagon
దక్షిణ చైనా సముద్రంలో బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగం
author img

By

Published : Aug 28, 2020, 10:11 AM IST

దక్షిణ చైనా సముద్రంలో చైనా మరింత దుందుడుకు వైఖరి ప్రదర్శిస్తోంది. సైనిక విన్యాసాల్లో భాగంగా ఈ ప్రాంతంలో డ్రాగన్​ దేశం నాలుగు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు అమెరికా తెలిపింది. చైనా చర్యలతో ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా పెరుగుతాయని పేర్కొంది.

ఆగస్టు 23 నుంచి 29 వరకు దక్షిణ చైనా సముద్రం పారాసెల్​ ఐల్యాండ్స్​ ప్రాంతంలో సైనిక అభ్యాసాలు నిర్వహిస్తామని చైనా ఇటీవలే ప్రకటించింది. దీనిపై అగ్రరాజ్యం ఆందోళన వ్యక్తం చేస్తోంది. వివాదాస్పద ప్రాంతంలో చైనా చర్యలతో మరింత అస్థిరత్వం నెలకొంటుందని పేర్కొంది.

దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతలు తలెత్తకుండా, శాంతిని నెలకొల్పేందుకు ఈ ప్రాంతంలో ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించబోమని 2002లో చైనా చేసిన ప్రకటనకు విరుద్ధంగా ప్రస్తుత సైనిక అభ్యాసాలు ఉన్నాయని అమెరికా తెలిపింది.

ఇండో-పసిఫిక్​ ప్రాంతంలో స్వేఛ్చ, శాంతియుత వాతావరణం ఉండాలని అమెరికా కోరుకుంటోందని, చైనా చర్యలు ఇందుకు వ్యతిరేకంగా ఉన్నాయని పెంటగాన్​ పేర్కొంది. దక్షిణ చైనా సముద్రంలో సైనిక మోహరింపులు ఉండకూడదనే ప్రతిజ్ఞకు ఈ చర్యలు పూర్తి విరుద్ధమని స్పష్టం చేసింది. సైనిక మోహరింపులపై చైనాను జులైలోనే అప్రమత్తం చేశామని అమెరికా గుర్తు చేసింది. కానీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని వివరించింది. ఉద్రిక్తతలు మరింత పెంచేందుకే చైనా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని తెలిపింది.

ఇండో-పసిఫిప్ ప్రాంతంలో టాస్క్​ఫోర్స్​ను మోహరించనున్నట్లు ప్రకటించింది అమెరికా. ఈ ప్రాంతంలో ఎలాంటి సంక్షోభాలు తలెత్తినా స్పందించేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

ఇదీ చూడండి: రష్యా టీకా బేషుగ్గా పనిచేస్తోంది: పుతిన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.