సరిహద్దు వివాదాల్లో చైనా అనుసరిస్తున్న దూకుడు విధానం సరైంది కాదన్నారు అమెరికా డెమొక్రాట్ పార్టీ సెనేటర్ బోబ్ మెనెండెజ్. పొరుగు దేశాల అభిప్రాయాలను గౌరవించకుండానే ఆసియా భౌగోళిక చిత్రపటాన్ని మార్చి గీయాలని చైనా ప్రయత్నిస్తోందన్నారు.
భారత్- చైనా మధ్య సరిహద్దు వెంట నెలకొన్న ఉద్రిక్తతలపై కీలక వ్యాఖ్యలు చేశారు . 2017 డోక్లాం ఉద్రిక్తతల నాటి నుంచి ఇటీవల తూర్పు లద్దాఖ్‌లో ఇరుదేశాల సైన్యం మధ్య ఘర్షణల వరకు చైనా వ్యవహార సరళిని గమనిస్తే పొరుగు దేశాల అభిప్రాయాలను ఏమాత్రం గౌరవించడం లేదని అనిపిస్తోందన్నారు. అయితే చైనా విస్తరణ విధానాలను అంతర్జాతీయ సమాజం ఎంతమాత్రము హర్షించబోదన్నారు బోబ్.
అమెరికా, భారత్‌ల్లో ప్రజాస్వామ్య పరిరక్షణకు ఉన్న అంకిత భావమే ఇరు దేశాల భాగస్వామ్యాన్ని కాపాడుతోందన్నారు. అంతర్జాతీయ చట్టాలను గౌరవించే విధానం, వివాదాల పరిష్కారానికి శాంతియుత దౌత్యం ఇరుదేశాల మైత్రిని మరింత పటిష్టం చేసిందన్నారు.
ఇదీ చూడండి: బలూచిస్థాన్‌కు స్వతంత్రం సాధ్యమా? ఎప్పటికి?