ETV Bharat / international

కరోనా కీలక వివరాలను చైనా దాస్తోంది: అమెరికా - us china news

కరోనాకు సంబంధించిన కీలక వివరాలను దాస్తూ ప్రపంచాన్ని చైనా గందరగోళానికి గురి చేస్తోందని ఆరోపించారు అమెరికా విదేశాంగ మంత్రి మైక్​ పాంపియో. వుహాన్​ ల్యాబ్​ నుంచే వైరస్​ బయటకు వచ్చి ఉంటుందని ఆయన మరోసారి ఉద్ఘాటించారు.

China continues to hide and obfuscate COVID 19 data
చైనా కరోనా వివరాలను దాస్తోంది: అమెరికా
author img

By

Published : May 9, 2020, 8:56 AM IST

ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా మహమ్మారి చైనాలోని వుహాన్​ ల్యాబ్​లోనే ఉద్భవించిందని మరోసారి ఉద్ఘాటించారు అమెరికా విదేశాంగ మంత్రి మైక్​ పాంపియో. అందుకు తమ వద్ద బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పారు. వుహాన్​ ల్యాబ్ ప్రమాణాలు పాటించడం లేదని, భద్రతాా పరమైన ప్రమాదాలు ఉన్నాయని ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు.

చైనాలో కరోనా వైరస్​ను గుర్తించి నెలలు గడుస్తున్నప్పటికీ ఆ దేశం దానికి సంబంధించిన కీలక విషయాలను దాచిపెడుతూ ప్రపంచ దేశాలను అయోమయానికి గురిచేస్తోందని ఆరోపించారు పాంపియో. అందుకే వుహున్​ ల్యాబ్​ను పరిశీలించేందుకు ఎవరికీ అనుమతి ఇవ్వడం లేదని విమర్శించారు. ఆస్ట్రేలియా, ఐరోపా సమాఖ్య సహా ఎవరూ ఈ విషయం గురించి అడిగినా వ్యాపార పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించి భయాందోళనకు గురి చేస్తోందన్నారు.

కరోనా కారణం అగ్రరాజ్యం అమెరికా అతలాకుతలమైంది. ఆ దేశంలో ఇప్పటి వరకు 78,000మందికి పైగా వైరస్​ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. 13,00,000 మందికి పాజిటివ్​గా తేలింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.