ETV Bharat / international

'అన్ని దేశాలకు కరోనా వ్యాపించేలా చైనా కుట్ర'

కరోనా మహమ్మారి వ్యాప్తికి కేంద్రబిందువైన చైనాపై మరోసారి విమర్శలు గుప్పించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​. డ్రాగన్​ దేశం తలచుకుంటే వైరస్ వ్యాప్తిని నిలువరించేదని, కానీ అలా చేయకుండా ప్రపంచం మొత్తానికి వ్యాపింపజేసింది ధ్వజమెత్తారు. కరోనాపై చైనా పారదర్శకంగా వ్యవహరించలేదని పునరుద్ఘాటించారు.

China 'chose' not to stop coronavirus from spreading across the world: Trump
'చైనా తలచుకుంటే కరోనాను ఆపేది.. కానీ అలా చేయలేదు'
author img

By

Published : Jul 21, 2020, 5:14 PM IST

చైనా తలచుకుంటే కోరనా వైరస్​ను ప్రపంచం మొత్తానికి వ్యాపించకుండా నిలువరించి ఉండేదన్నారు అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. కానీ డ్రాగన్​ దేశం అలా చేయలేదని, అన్ని దేశాలకు వ్యాపింపజేయాలనుకుందని ఆరోపించారు. ఫలితంగా అమెరికా సహా అనేక దేశాలు వైరస్ మహమ్మారి కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ట్రంప్.

"వైరస్ చైనాలోనే ఉద్భవించింది. అది ఇతర దేశాలకు వ్యాపించకుండా వారు కట్టడి చేయగలిగే వారు. సులభంగా నిలువరించేవారు. కానీ అలా చేయలేదు. ఇతర దేశాలకు వైరస్​ను వ్యాపింపజేయాలనుకున్నారు. చైనా మొత్తం విస్తరించకుండా ఆపగలిగారు. కానీ ఐరోపా, అమెరికా సహా ఇతర దేశాలకు వ్యాప్తి చెందకుండా అడ్డుకోలేకపోయారు. కరోనా విషయంలో చైనా ఏనాడూ పారదర్శకంగా వ్యవహరించలేదు.

గత రెండు వారాలుగా వివిధ దేశాధినేతలతో ఫోన్లో సంభాషించాను. అన్ని దేశాల్లో మహమ్మారి వ్యాప్తి ఉద్ధృతంగా ఉంది. కరోనాపై పోరులో ఇతర దేశాలకు అమెరికా సాయం అందిస్తోంది. వెంటిలేటర్లను సరఫరా చేస్తోంది. కరోనాకు వ్యాక్సిన్, చికిత్స కోసం గొప్ప కంపెనీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. వారి ప్రయత్నాలు ఎక్కడి వరకు వచ్చాయో త్వరలోనే సవివరంగా తెలియజేస్తారు."

-డొనాల్డ్​ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

ఇదీ చూడండి: బస్సులో 20 మందిని బంధించిన సాయుధుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.