చిలీ వైమానిక దళానికి చెందిన విమానం అదృశ్యమైంది. అందులో 38మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు.
స్థానిక కాలమానం ప్రకారం సీ-130 విమానం నిన్న సాయంత్రం 4.55గంటలకు పుంటా ఏరినాస్ నగరం నుంచి బయలుదేరింది. అంటార్కిటిక్కు వెళ్తున్నమార్గంలో ఆ విమానంతో సంబంధాలు తెగిపోయినట్లు వైమానిక దళ అధికారులు వెల్లడించారు. ఆచూకీ కనుగొనేందుకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపారు.
ఇదీ చూడండి : శరణార్థులకు పౌరసత్వం.. సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం