ETV Bharat / international

'ఉగ్రవాదుల చేతుల్లో చిన్నపాటి ఆయుధాలు'

అనేక అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు చౌకగా దొరికే తేలికపాటి మారణాయుధాలనే ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు ప్రకటించింది ఐరాస. సులువుగా రవాణా చేయగలిగే వాటి వల్ల అంతర్జాతీయంగా శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతోందని, తక్షణమే సభ్యదేశాలు ఈ సమస్య పరిష్కారానికి ముందుకు రావాలని పిలుపునిచ్చింది.

Cheap, small arms becoming weapon of choice of many terror groups: UN counter-terrorism chief
'ఉగ్రవాదుల చేతుల్లో చిన్నపాటి ఆయుధాలు'
author img

By

Published : Feb 22, 2020, 2:11 PM IST

Updated : Mar 2, 2020, 4:27 AM IST

అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు వినియోగిస్తున్న ఆయుధాలపై ఐక్యరాజ్య సమితి స్పందించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక తీవ్రవాద సంస్థలు చౌకగా దొరికే చిన్నపాటి మారణాయుధాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారని ఐరాస తీవ్రవాద నిరోధక విభాగం చీఫ్​ వ్లాదిమిర్​ వొరోంకోవ్​ పేర్కొన్నారు. తేలికపాటి మారణాయుధాలు ఉగ్రవాదుల చేతుల్లోకి పోవడం వల్ల అంతర్జాతీయంగా శాంతి భద్రతలకు భంగం కలుగుతోందన్నారు.

"చిన్న, తేలికపాటి ఆయుధాల అక్రమ రవాణాను ఎదుర్కోవడంలో అంతర్జాతీయ స్థాయిలో తీసుకుంటున్న చర్యలు సరిపోవడం లేదు. సభ్యదేశాలు ఉగ్రవాదులను గుర్తించి ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం పెను సవాలుగా మారింది. చిన్న ఆయుధాలు కావడం వల్ల ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సులువుగా తరలిస్తున్నారు."

-వ్లాదిమిర్​ వొరోంకోవ్​, తీవ్రవాద నిరోధక విభాగం చీఫ్

ప్రతి 12 మందిలో ఒకరి దగ్గర..

ఒక్క ఆఫ్రికాలోనే వంద మిలియన్ల మేరా చిన్న, తేలికపాటి ఆయుధాలు ఉన్నాయని అంచనా వేసింది ఐరాసా. 1.2 బిలియన్ల జనాభా కలిగిన ఆఫ్రికాలో ప్రతి 12 మందిలో ఒకరి దగ్గర ఆయుధం కలిగి ఉన్నట్లు చెబుతోంది.

అంతర్జాతీయ స్థాయిలో పటిష్ఠమైన చర్యలు లేకపోవడం వల్ల.. తీవ్రవాదులు, నేరస్థులు సునాయాసంగా ఆయుధాలను తరలిస్తున్నారని ఐరాస తెలిపింది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు సభ్యదేశాలు ముందుకు రావాలని ఐరాస ఉగ్రవాద నిరోధక శాఖ పిలుపునిచ్చింది.

Last Updated : Mar 2, 2020, 4:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.