ETV Bharat / international

జార్జి ఫ్లాయిడ్ కేసు: దోషిగా తేలిన పోలీసు అధికారి - మినియాపొలిస్ కోర్టు

అమెరికాలో సంచలనం సృష్టించిన ఆఫ్రికా నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ హత్య కేసుకు సంబంధించి మంగళవారం తీర్పు వెలువరించింది మినియాపొలిస్ కోర్టు. పోలీసు అధికారి డెరిక్ చౌవిన్​ను దోషిగా తేల్చింది. త్వరలోనే నిందితుడికి శిక్ష ఖరారు చేయనున్నట్లు పేర్కొంది.

george floyd, derek chauvin
జార్జి ఫ్లాయిడ్, డెరిక్ చౌవిన్
author img

By

Published : Apr 21, 2021, 7:24 AM IST

Updated : Apr 21, 2021, 12:02 PM IST

అమెరికా నల్లజాతీయుడు జార్జిఫ్లాయిడ్ మరణానికి కారణమైన పోలీసు అధికారి డెరిక్ చౌవిన్​ను దోషిగా తేల్చింది అమెరికా మినియాపొలిస్ కోర్టు. మంగళవారం ఈ తీర్పును వెలువరించింది. డెరిక్కు బెయిల్​ రద్దు చేస్తున్నట్లు తెలిపిన న్యాయస్థానం.. మరో రెండు నెలల్లో శిక్ష ఖరారు చేస్తామని స్పష్టం చేసింది. 40 ఏళ్ల పాటు డెరిక్​కు జైలు శిక్ష పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు ఫ్లాయిడ్ కుటుంబసభ్యులు. ఈ తీర్పు అనంతరం.. ఫ్లాయిడ్​ ​మద్దతుదారులు అమెరికా వ్యాప్తంగా ర్యాలీలు చేపట్టారు. వీధుల్లో ప్లకార్డులు పట్టుకుని తిరుగుతూ ఆనందం వ్యక్తం చేశారు. 'ఈరోజు మేము మళ్లీ శ్వాస తీసుకోగలం' అని ఫ్లాయిడ్ తమ్ముడు ఫిలోనైస్ అన్నారు.

george floyd case
ఫ్లాయిడ్​కు నివాళి
george floyd case
టపాసులు కాల్చుతున్న మద్దతుదారులు

ఇదీ చదవండి:

జాతి వివక్షపై అట్టుడుకుతున్న అగ్రరాజ్యం

జాతి వివక్షకు వ్యతిరేకంగా మూడు ఖండాల్లో నిరసనలు

'ఇంతటితో ఆగదు'

వివిక్షకు వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి సంబంధించి ఇది కీలక ముందడుగు అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ఫ్లాయిడ్ కేసులో చౌవిన్​ను కోర్టు దోషిగా తేల్చిన అనంతరం.. శ్వేతసౌదం నుంచి మాట్లాడారు బైడెన్. 'ఇది సరిపోదు.. ఇంతటితో ఆగదు' అని అన్నారు.

తర్వాత అధ్యక్షుడు బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలాహారిస్.. ఫ్లాయిడ్ కుటుంబసభ్యులకు ఫోన్​ చేసి మాట్లాడారు. ఈ కేసుకు సంబంధించి తప్పక న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు ఫ్లాయిడ్ కుటుంబసభ్యులతో చెప్పారు.

భారతీయ అమెరికన్ల హర్షం

కోర్టు తీర్పును భారతీయ అమెరికన్ చట్టసభ్యులు స్వాగతించారు. 'ఈ తీర్పుతో న్యాయం జరిగింది. అయినప్పటికీ.. డెరిక్​కు శిక్ష పడినంత మాత్రాన ఫ్లాయిడ్​ను​ వెనక్కితీసుకురాలేం' అని కాంగ్రెస్​ నాయకురాలు ప్రమీల జైపాల్ అన్నారు. బ్లాక్​ లైవ్స్​ మేటర్​ అని నినాదాలు చేశారు.

george floyd case
తీర్పు అనంతరం కన్నీటిపర్యంతమైన ఫ్లాయిడ్ మద్దతుదారులు

అరెస్టు చేసే నెపంతో ఫ్లాయిడ్​ మెడమీద తొమ్మిది నిమిషాలపాటు కాలుపెట్టి ఆయన మరణానికి కారకుడయ్యారు పోలీసు అధికారి చౌవిన్. ఈ నేపథ్యంలో చౌవిన్​.. సెకండ్​ డిగ్రీ అన్​ఇంటెన్షనల్ మర్డర్, థర్డ్​ డిగ్రీ మర్డర్, సెకండ్ డిగ్రీ మ్యాన్​స్లాటర్​కు కారకుడని, అతనికి ఈ మూడు కేసులకు సంబంధించిన శిక్ష విధించనున్నట్లు కోర్టు తెలిపింది.

ఇదీ చదవండి:

అమెరికాలో ఆగని 'ఫ్లాయిడ్​' రగడ.. ఉద్ధృతంగా ఆందోళనలు

ఫ్లాయిడ్ నిరసనలు: ఇసుకేస్తే రాలనంత జనం!

Last Updated : Apr 21, 2021, 12:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.