ETV Bharat / international

ఐసొలేషన్, క్వారంటైన్​​ లెక్కలు మారాయ్.. కొత్త రూల్స్ ఇవే... - ఐసొలేషన్​ నిబంధనలు

Isolation quarantine covid rules: క్వారంటైన్​.. ఐసొలేషన్​.. కొవిడ్​ మహమ్మారి పుట్టినప్పటి నుంచి వింటున్న మాటలు ఇవి. వీటి నిబంధనల్లో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా అధికారులు మరికొన్ని మార్పులు చేశారు. కొవిడ్​ బాధితులు, వారికి సన్నిహితంగా ఉన్న ప్రజలు వాటిని కచ్చితంగా తెలుసుకోవాలి. అవేంటంటే..

Isolation quarantine covid rules
ఐసొలేషన్- క్వారంటైన్​​ లెక్కలు మారాయి.. కొత్త రూల్సే ఇవే!
author img

By

Published : Dec 28, 2021, 1:56 PM IST

Isolation quarantine covid CDC: ఐసొలేషన్​, క్వారంటైన్​ నిబంధనల్లో అమెరికా సీడీసీ(వ్యాధి నివారణ, నియంత్రణ కేంద్రం) కీలక మార్పులు చేసింది.

వైరస్​ నిర్ధరణకు ముందు రెండు రోజులు, తర్వాత మూడు రోజుల్లోనే తీవ్రత అధికంగా ఉంటోందని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. మరోవైపు ఒమిక్రాన్​తో ఇప్పటికే రికార్డు స్థాయిల్లో కేసులు నమోదవుతున్నాయి. కొత్త వేరియంట్​ తీవ్రత తక్కువగానే ఉన్నా.. వ్యాప్తి వేగంగా ఉందని పలు పరిశోధనల్లో తేలింది. ఈ క్రమంలో ఆరోగ్య వ్యవస్థతో పాటు ఆర్థిక వ్యవస్థపై భారం పడకుండా ఉండేందుకు సీడీఎస్​ నిబంధనల్లో మార్పులు చేసింది. అమెరికాలోని పలు ప్రాంతాల్లో ఆరోగ్య కార్యకర్తల ఐసొలేషన్​ సమయాన్ని ఇప్పటికే కుదించారు. గతంలో ఉన్న రూల్స్​ కన్నా తక్కువ రోజుల్లోనే కొవిడ్​ సోకిన వారు విధుల్లో చేరుతున్నారు.

ఐసొలేషన్​ అంటే? కొత్త నిబంధనలేంటి?

కొవిడ్​ సోకిన వారికి ఈ నిబంధనలు వర్తిస్తాయి. టీకాలు తొలి డోసు తీసుకున్న వారికి అసలు టీకాలే తీసుకోని వారికి, బూస్టర్​ డోసు తీసుకున్న ప్రజలకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయి. వీటి ప్రకారం..

  • ఐసొలేషన్​ అనేది కొవిడ్​ పాజిటివ్​గా తేలిన రోజు నుంచి మొదలవుతుంది.
  • కొవిడ్​ పాజిటివ్​ తేలిన వ్యక్తి.. 5 రోజుల పాటు ఐసొలేషన్​లో ఉండాలి. గతంలో ఇది 10రోజులు.
  • ఐదు రోజుల తర్వాత.. లక్షణాలు ఇంకా ఉంటే ఇంట్లోనే ఉండాలి. ఆ తర్వాత ఐదు రోజులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి.

క్వారంటైన్​ నిబంధనలేంటి?

New covid quarantine rules: కొవిడ్​ సోకిన వ్యక్తికి సన్నిహితంగా ఉండి, వైరస్​ సోకని ప్రజలకు క్వారంటైన్​ నిబంధనలు వర్తిస్తాయి. సన్నిహితంగా ఉన్న వారికి కొవిడ్​ సోకిందని తేలిన రోజు నుంచే క్వారంటైన్​ నిబంధనలు అమల్లోకి వస్తాయి. వీటి ప్రకారం..

గతంలో.. క్వారంటైన్​ పది రోజులు ఉండేది. రెండు డోసులు పూర్తిగా తీసుకున్న వారికి కొంత మినహాయింపు ఉండేది. అయితే ఇప్పుడు.. బూస్టర్​ డోసు తీసుకున్న వారు మాత్రమే క్వారంటైన్​ నుంచి ఉపశమనం పొందొచ్చని సీడీసీ పేర్కొంది. కానీ కనీసం 10 రోజుల పాటు మాస్కులు ఎల్లప్పుడూ ధరించాలని స్పష్టం చేసింది. అదే సమయంలో టీకా తీసుకోని ప్రజలు, పాక్షికంగా, పూర్తిగా వ్యాక్సినేషన్​ తీసుకున్న ప్రజలు 5రోజుల పాటు క్వారంటైన్​లో ఉండాలని స్పష్టం చేసింది. ఆ తర్వాత ఐదు రోజుల పాటు మాస్కులు కచ్చితంగా ధరించాలి.

లాభమెంత?

10 రోజుల క్వారంటైన్​, ఐసొలేషన్​ కాలాన్ని 5 రోజులకు కుదించడం రిస్క్​తో కూడిన వ్యవహారమే. 'రోగి నుంచి వైరస్​ వ్యాప్తి చెందే అవకాశం 5 రోజుల తర్వాత తగ్గుతుంది. కానీ పూర్తిగా మాయమైపోదు. రోగి ఎక్కడికి వెళ్లినా వైరస్​ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. అందుకే మాస్కులు కచ్చితంగా ధరించాలి,' అని న్యూయార్క్​ ఫిజీషియన్​ డా. ఆరోన్​ గ్లాట్​ తెలిపారు.

ఇదీ చూడండి:- 'మాస్కు' మహత్తు ఇప్పటికైనా తెలుసుకోండి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.