ETV Bharat / international

అధ్యక్ష ఎన్నికలకు ముందే అమెరికా వ్యాక్సిన్​! - కరోనా వైరస్ తాజావార్తలు

అధ్యక్ష ఎన్నికల ముందే కరోనా వ్యాక్సిన్​ను అందుబాటులోకి తెచ్చేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. నవంబర్​ 1 నాటికి పంపిణీకి సిద్ధంగా ఉండాలని ఇప్పటికే రాష్ట్రాలకు సూచించింది ట్రంప్ ప్రభుత్వం. అయితే శాస్త్రీయంగా కాకుండా అధ్యక్ష ఎన్నికల కోసం వ్యాక్సిన్​ తీసుకొస్తున్నారని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

vaccines
అమెరికా వ్యాక్సిన్
author img

By

Published : Sep 3, 2020, 11:55 AM IST

ఊహాగానాలను నిజం చేస్తూ అధ్యక్ష ఎన్నికలకు ముందుగానే కరోనా వ్యాక్సిన్​ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది ట్రంప్ ప్రభుత్వం. నవంబర్ 1 నాటికి టీకా పంపిణీకి సిద్ధంగా ఉండాలని రాష్ట్రాలను ఆదేశించింది ఫెడరల్ ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్రాల గవర్నర్లకు.. వ్యాధి నియంత్రణ కేంద్రం(సీడీసీ) చీఫ్ రాబర్ట్​ రెడ్​ఫీల్డ్ లేఖ రాశారు.

"త్వరలోనే అన్ని రాష్ట్రాలకు మెక్​కెస్సాన్​ కార్పొరేషన్​ నుంచి అనుమతులు లభిస్తాయి. టీకా పంపిణీ ఏర్పాట్లను వేగవంతం చేయడంలో మీ సాయాన్ని కోరుతోంది సీడీసీ. అవసరమైతే, 2020 నవంబర్​ 1 నాటికి ఇవి పూర్తి కావాలి" అని రాబర్ట్ లేఖలో పేర్కొన్నారు.

ఇదీ చూడండి: వ్యాక్సిన్​ ట్రయల్స్ ఆలస్యంపై ట్రంప్ మండిపాటు

అమెరికాలోని రాష్ట్రాలు, స్థానిక ఆరోగ్య విభాగాలు, ఆసుపత్రుల్లో వ్యాక్సిన్​ పంపిణీకి మెక్​కెస్సాన్​.. సీడీసీతో ఒప్పందం చేసుకుంది.

అక్టోబర్​ చివరి వారంలో..

అంతేకాకుండా.. కొన్ని ఆరోగ్య శాఖలకు 3 ప్రణాళిక ప్రతులను పంపింది సీడీసీ. వ్యాక్సిన్​ పంపిణీకి సంబంధించిన ప్రణాళికలను ఇందులో పొందుపరిచారు. వీటి ప్రకారం.. అక్టోబర్​ చివరినాటికి వ్యాక్సిన్​ అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.

నవంబర్​ మొదటి వారంలో పరిమిత సంఖ్యలో వ్యాక్సిన్ డోసులు అందివ్వనున్నట్లు సమాచారం. 2021 నుంచి సరఫరా పెంచనున్నట్లు ఈ ప్రతుల్లో ఉంది. తొలుత వచ్చే వ్యాక్సిన్లకు అమెరికా ఆహార, ఔషధ విభాగం (ఎఫ్​డీఏ) లేదా ఏదైనా అత్యవసర అధికారాలున్న సంస్థ ఆమోదిస్తుందని పేర్కొంది.

నిపుణుల ఆందోళన..

అయితే, ఈ విషయంపై పలువురు ప్రజారోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. శాస్త్రీయత కన్నా అధ్యక్ష ఎన్నికలే టీకా ఆమోదాన్ని నిర్ణయిస్తాయా అని ప్రశ్నించారు. అక్టోబర్​ సర్​ప్రైజ్​ అంటే ఇదేనా అంటూ అసహనం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: వ్యాక్సిన్​ రేసులో ట్రంప్​పై పుతిన్​ గెలిచారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.