ETV Bharat / international

యూఎస్​లో 8 నెలల్లో 22 లక్షల మంది మృతి

కరోనా మహమ్మారి కారణంగా అమెరికాలో మరణాల సంఖ్య గణనీయంగా పెరిగింది. సాధారణంగా ప్రతిఏటా సంభవించే మరణాల సంఖ్యతో పోల్చితే.. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్​ మధ్య కాలంలో 3 లక్షల మంది వరకు అదనంగా మరణించారు. ఈ ఎనిమది నెలల కాలంలో సాధారణంగా మరణాల సంఖ్య 19 లక్షలు ఉంటే.. కరోనా మృతులతో కలిపి ఆ సంఖ్య 22 లక్షలకు చేరినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.

Deaths in America
అమెరికాలో పెరిగిన మరణాల సంఖ్య
author img

By

Published : Oct 21, 2020, 4:17 PM IST

అమెరికాలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తూ.. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందిని పొట్టనపెట్టుకుంటోంది. ప్రతిఏటా సంభవించే మరణాలతో పోలిస్తే ఈ ఏడాది కరోనా ప్రారంభమైన తర్వాత సాధారణం కన్నా మరో 3 లక్షల మంది వరకు అదనంగా ప్రాణాలు కోల్పోయారని తాజాగా విడుదల చేసిన అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

ఈ ఏడాది దేశంలో సంభవించిన మరణాలపై నివేదిక రూపొందించింది వ్యాధుల నియంత్రణ, నిర్మూలన కేంద్రం(సీడీసీ). గతంలో వివిధ సంవత్సరాల్లో నమోదైన మరణాల సంఖ్యతో పోల్చి చూసింది. ప్రతిఏటా సంభవించే మరణాల కన్నా ఈ ఏడాది కరోనా ప్రారంభమైన నుంచి ఫిబ్రవరి-సెప్టెంబర్​ మధ్య కాలంలో 3 లక్షల వరకు అదనపు మరణాలు నమోదైనట్లు తేల్చింది సీడీసీ.

14.5 శాతం పెరుగుదల..

సాధారణంగా ప్రతిఏటా ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్​ మధ్య కాలంలో అమెరికాలో దాదాపు 19 లక్షల మరణాలు నమోదవుతాయి. కానీ ఈ ఏడాది ఆ సంఖ్య 14.5 శాతం పెరిగింది. దాదాపు 22 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అదనపు మరణాల్లో మూడింట రెండొంతుల మరణాలకు కరోనా వైరస్​ కారణమైనట్లు తేలింది.

ఇతర మరణాల్లోనూ కరోనా ఒక కారణంగా ఉందని తెలిపారు సీడీఎస్​ అధికారులు. గుండెపోటు లక్షణాలతో ఆసుపత్రికి వెళితే అక్కడ కరోనా రోగులతో నిండిపోవటం వల్ల.. మరణానికి దారి తీసిన సందర్భాలు ఉన్నాయని ఉదహరించారు.

అదనపు మరణాల్లో అత్యధికంగా 95 వేల మంది 75-84 ఏళ్ల వయస్సులోనే ఉన్నట్లు వెల్లడించింది నివేదిక. అది సాధారణ ఏడాదితో పోలిస్తే 21.5 శాతం అధికమని తేల్చింది. అయితే.. 25-44 ఏళ్ల వయస్సు వారి మరణాలు 26.5 శాతం పెరుగాయి. మరోవైపు.. 25 ఏళ్లలోపు వారి మరణాల్లో తగ్గుదల నమోదవటం ఊరట కలిగించే విషయం. హిస్పానిక్​ అమెరిక్లలోనే 54 శాతం మరణాలు సంభవించాయి.

ఇదీ చూడండి: కోపమొచ్చి.. ఇంటర్వ్యూ మధ్యలోంచి వెళ్లిపోయిన ట్రంప్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.