అమెరికాలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. ఇప్పటికే అమెరికాలోని యుక్తవయసు వారిలో సగం మందికిపైగా వ్యాక్సిన్ అందింది. ఈ నేపథ్యంలో అమెరికా అంటు వ్యాధుల నివారణ కేంద్రం(సీడీసీ) తాజాగా కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా వ్యాక్సిన్ రెండుడోసులు తీసుకున్నవారు బయటకు వెళ్లేటప్పుడు మాస్కు ధరించాల్సిన అవసరం లేదని పేర్కొంది. అయితే బాగా రద్దీ ఉండే ప్రదేశాల్లో మాత్రం మాస్కు ధరించటం మేలని సూచించింది.
'స్వాతంత్ర్యం తిరిగొచ్చింది'
సీడీసీ మార్గదర్శకాలపై అమెరికాలోని ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు డాక్టర్. మైక్ సాగ్ స్పందించారు. అమెరికాలో స్వాతంత్ర్యం తిరిగొచ్చిందన్నారు. అగ్రరాజ్యంలో సాధారణ పరిస్థితులు వస్తాయని తెలిపారు.
ఇదీ చదవండి : '18 ప్లస్'కు టీకా రిజిస్ట్రేషన్.. నేటినుంచే