ETV Bharat / international

'క్యాపిటల్​ దాడి'కి ఏడాది.. చట్టసభ్యుల కొవ్వొత్తుల ప్రదర్శన

author img

By

Published : Jan 7, 2022, 11:36 AM IST

Updated : Jan 7, 2022, 11:59 AM IST

Capitol riots anniversary: 2020, జనవరి 6న అమెరికా క్యాపిటల్​ హిల్​ భవనంపై దాడి జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా గురువారం సాయంత్రం కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు కాంగ్రెస్​ నాయకులు, చట్టసభ్యులు. వందమందికిపైగా హాజరై ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు నివాళులర్పించారు.

Capitol riot
చట్టసభ్యుల కొవ్వత్తుల ప్రదర్శన

Capitol riots anniversary: అమెరికా క్యాపిటల్​ భవనంపై గతఏడాది జనవరి 6న జరిగిన దాడికి గురువారానికి ఏడాది పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్​ నాయకులు, చట్టసభ్యులు.. క్యాపిటల్​ భవనం మెట్లపై కొవ్వొత్తులతో మౌన ప్రదర్శన చేశారు. అనాటి భీతావాహ పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. క్యాపిటల్​ భవనం రక్షణ కోసం పోరాడిన జవాన్ల ధైర్యసాహసాలను కొనియాడారు. అమరులైన వారికి నివాళులర్పించారు.

Capitol riot
కొవ్వత్తుల ప్రదర్శనలో చట్టసభ్యులు

క్యాపిటల్​​ భవనం వెలుపల వందకుపైగా కాంగ్రెస్​ సభ్యులు మాస్క్​లు ధరించి ఈ కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొన్నారు. దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు హౌస్​ స్పీకర్​ నాన్సీ పెలోసీ.

"క్యాపిటల్​పై దాడికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా సెనేట్​ డెమొక్రాటిక్​ నాయకుడు, హౌస్​, సెనేట్​ సభ్యుల తరఫున నివాళులర్పిస్తున్నాం. ఆ రోజున క్యాపిటల్​ను, ప్రజాస్వామ్యాన్ని కాపాడిన హీరోలను గౌరవించుకోవాలి. ప్రజాస్వామ్యం కోసం ప్రాణాలర్పించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఇక్కడున్నవారు కొన్ని క్షణాలు మౌనం పాటించాలి."

- నాన్సీ పెలోసీ, హౌస్​ స్పీకర్​.

పెలోసీతో పాటు డెమొక్రాటిక్​ పార్టీ అగ్రనేతలు చుక్​ చుమెర్​, రిచార్డ్​ దర్బిన్​, స్టేని హోయెర్​ హాజరయ్యారు. దీంతోపాటు.. క్యాపిటల్​ దాడికి ఏడాది పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు ప్రజలు.

నేషనల్​ మాల్​ వద్ద

క్యాపిటల్​ భవనంపై జరిగిన దాడికి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో వాషింగ్టన్​లోని నేషనల్​ మాల్​ వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు పలువురు పౌరులు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. క్యాపిటల్​పై జరిగిన దాడిని గుర్తు చేసుకుని ఆందోళన వ్యక్తం చేశారు.

Capitol riot
నేషనల్​ మాల్​ వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన
Capitol riot
క్యాపిటల్​ భవనం సమీపంలో ఓ పౌరుడి కొవ్వొత్తి ప్రదర్శన
Capitol riot
ప్లకార్డులు ప్రదర్శిస్తున్న ఓ పౌరుడు

దాడి జరిగింది ఇలా..

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌ ఎన్నికను ధ్రువీకరించేందుకు చేపట్టిన కాంగ్రెస్ సంయుక్త సమావేశాన్ని వ్యతిరేకిస్తూ వందలాది మంది ట్రంప్‌ మద్దతుదారులు ఈ నెల 6న చేపట్టిన ఆందోళన హింసాత్మతంగా మారింది. సమావేశానికి వేదిక అయిన క్యాపిటల్‌ భవనంలోకి నిరసనకారులు బారికేడ్లు తోసుకుంటూ చొచ్చుకెళ్లారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసుల కళ్లలో రసాయనాలు చల్లి వారితో ఘర్షణకు దిగారు. పోలీసులు కాల్పులు కూడా జరపాల్సివచ్చింది. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అమెరికా చరిత్రలోనే మాయని మచ్చగా మిగిలిపోయిన ఈ ఘటనకు సంబంధించి పలు కమిటీలు దర్యాప్తు చేస్తున్నాయి. ఈ దుశ్చర్యకు సంబంధించి అమెరికా న్యాయశాఖ దాదాపు 700 మందిపై అభియోగాలు మోపింది.

ఇదీ చూడండి:

'అధికారమార్పిడి హింసాత్మకం చేసిన ఏకైక అధ్యక్షుడు ట్రంప్​'

ట్రంప్​ మద్దతుదారులపై దేశద్రోహం కేసు!

'క్యాపిటల్'​పై దాడి చేసిన వారి ఉద్యోగాలపై వేటు!

Last Updated : Jan 7, 2022, 11:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.