దేశంలో జరుగుతున్న రైతు నిరసనలకు మద్దతు పలికారు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు ఆందోళనలు ఉద్దేశించి మాట్లాడిన ఆయన... శాంతియుత నిరసనలకు ఎప్పుడూ తమ దేశం మద్దతుగా నిలుస్తుందని పేర్కొన్నారు.
గురునానక్ దేవ్ 551వ జయంతి సందర్భంగా కెనడాలోని భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన ట్రూడో... భారత్లోని రైతు నిరసనలపై ఆందోళన వ్యక్తం చేశారు.
రైతుల వ్యవహారంపై అంతర్జాతీయంగా స్పందించిన తొలి వ్యక్తి ట్రూడో కావడం గమనార్హం.
అలా అనడం సరికాదు
కెనడా ప్రధాని వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది. రైతు నిరసనలను ఉద్దేశించి ట్రూడో చేసిన వ్యాఖ్యలు అనవసరమైనవిగా పేర్కొంది. రాజకీయ ప్రయోజనాల కోసం దౌత్యపరమైన సంభాషణలు చేయకూడదని విదేశాంగ మంత్రిత్వ శాఖ హితవు పలికింది.
ఇదీ చూడండి: బైడెన్ చేతికి అమెరికా రహస్య సమాచారం