ETV Bharat / international

' మొదట ఆస్ట్రాజెనెకా తీసుకొని.. రెండో డోసుగా ఆ టీకాలు'

ఆస్ట్రాజెనెకా టీకాను మొదటి డోసుగా తీసుకున్నవారు.. ఎమ్​ఆర్​ఎన్​ఏ వ్యాక్సిన్లయిన ఫైజర్​ లేదా మోడెర్నా టీకాను రెండో డోసుగా తీసుకోవచ్చని కెనడా నిర్ణయించింది. మరోవైపు.. ఎలాంటి అలర్జీలు లేనట్లయితే ప్రతి ఒక్కరూ ఎంఆర్​ఎన్​ఏ వ్యాక్సిన్లను మొదటి డోసుగా తీసుకోవచ్చని స్పష్టం చేసింది.

vaccine, astrazenca, dose change
కొవిడ్​ టీకా, ఆస్ట్రాజెనెకా వ్యాక్సి న్​, రెండో డోసు
author img

By

Published : Jun 18, 2021, 12:24 PM IST

కరోనాపై పోరులో భాగంగా కెనడా కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రాజెనెకా టీకా మొదటి డోసు తీసుకున్నవారు రెండో డోసు కింద ఫైజర్​ లేదా మోడెర్నా వ్యాక్సిన్​ను తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు కెనడా నేషనల్​ అడ్వైజరీ కమిటీ ఆన్​ ఇమ్యూనైజేషన్ గురువారం తెలిపింది. ఆస్ట్రాజెనెకా టీకా మొదటి డోసు తీసుకున్నవారు కావాలనుకుంటే.. ఫైజర్​ లేదా మోడెర్నా టీకా తీసుకోవచ్చని జూన్​ 1నే ఈ కమిటీ తెలిపింది. అయితే రెండో డోసు ఎమ్​ఆర్​ఎన్​ఏ వ్యాక్సినే అయి ఉండాలని తాాజా ప్రకటనలో పేర్కొంది.

కొవిడ్​తో ముప్పు అధికంగా ఉన్నవారు ఫైజర్​ లేదా మోడెర్నా టీకా కోసం వేచి చూడకుండా ఆస్ట్రాజెనెకా టీకా తీసుకోవాలని ఈ కమిటీ గతంలో చేసిన సూచనలను తాజాగా సవరించింది. ఎలాంటి అలర్జీలు లేకపోతే ప్రతిఒక్కరూ ఎంఆర్​ఎన్​ఏ వ్యాక్సిన్​ను మొదటి డోసుగా తీసుకోవచ్చని సూచించింది. ఫైజర్​, మోడెర్నా టీకాల సరఫరా, ఆస్ట్రాజెనెకాతో రక్తంలో గడ్డ కట్టే సమస్యలు ఎదురవుతున్నాయన్న వార్తల నేపథ్యంలో ఈ తాజా సూచనలు చేసినట్లు కమిటీ ఛైర్మన్​ డాక్టర్​ షెల్లీ దీక్స్​ తెలిపారు. అదే సమయంలో ఆస్ట్రాజెనెకా టీకా మొదటి డోసు లేదా రెండు డోసులూ తీసుకున్న వారికి వైరస్​ ముప్పు తప్పుతోందని ఆమె పేర్కొన్నారు.

ఇదీ చూడండి: Covaxin: కెనడాకు 'కొవాగ్జిన్‌' టీకా.. ఆక్యుజెన్​తో డీల్​

ఇదీ చూడండి: 12ఏళ్లు దాటితే వ్యాక్సిన్‌.. కెనడా అనుమతి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.