కరోనా నిబంధనల్లో భాగంగా భారత విమానాలపై (Canada flights from india) విధించిన ఆంక్షలను కెనడా ఎత్తివేసింది. ఫలితంగా సోమవారం భారత్-కెనడా మధ్య ప్రత్యక్ష విమాన సేవలు ప్రారంభం కానున్నాయి(Canada flights update india). ఈ విషయాన్ని జస్టిన్ ట్రుడో ప్రభుత్వం ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది.
"సెప్టెంబర్ 27 నుంచి కెనడా-భారత్ మధ్య ప్రత్యక్ష విమానాలు పునఃప్రారంభమవుతాయి."
-- కెనడా ప్రభుత్వం.
ప్రభుత్వ గుర్తింపు ఉన్న ల్యాబొరేటరీ నుంచి కొవిడ్ నెగిటివ్ సర్టిఫికేట్ ఉంటేనే విమానంలోకి అనుమతిస్తారు(Canada flights from India news).
"దిల్లీ విమానాశ్రయంలో.. కొవిడ్ నెగిటివ్ రిపోర్టు చూపించాలి. అప్పుడే వారికి అనుమతి ఉంటుంది. రిపోర్టు కూడా ప్రయాణానికి 18 గంటలలోపు ఉండాలి."
-- కెనడా ప్రభుత్వం.
ఎయిర్ కెనడా.. సోమవారం నుంచి ప్రారంభమయ్యే అవకాశముంది. ఎయిర్ ఇండియా.. ఈ నెల 30న మొదలవుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
దేశంలో పరిస్థితులు మెరుగుపడిన నేపథ్యంలో కెనడా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
అంతర్జాతీయ విమానాలపై దేశంలో నిషేధం
అంతర్జాతీయ వాణిజ్య విమానాల రాకపోకలపై ఉన్న నిషేధాన్ని(Flight Ban India) ఈ నెల 30 వరకు పొడగిస్తూ గత నెలలో నిర్ణయం తీసుకుంది భారత ప్రభుత్వం. కమర్షియల్ ప్యాసెంజర్ విమానాలపై ఆంక్షలు అమల్లో ఉంటాయని ఓ ప్రకటనలో తెలిపింది. అయితే డీజీసీఏ (DGCA) అనుమతిచ్చిన కార్గో విమాన సర్వీసులు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈమేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది.
కొన్ని ఎంపిక చేసిన మార్గాల్లో అధికారుల అనుమతి ఉన్న అంతర్జాతీయ విమానాలకు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చింది కేంద్రం.
అమెరికాలో..
అమెరికా వివిధ దేశాలపై ప్రయాణ ఆంక్షలను (US travel restrictions) ఎత్తివేయనుంది. నవంబర్ నెల ప్రారంభం నుంచి భారత్‌తో పాటు, ఐరోపా సమాఖ్య దేశాలు, బ్రిటన్, చైనా, ఐర్లాండ్, దక్షిణాఫ్రికా, ఇరాన్, బ్రెజిల్ తదితర దేశాల ప్రయాణికుల రాకపోకలకు అనుమతి ఇవ్వనుంది. ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు శ్వేతసౌధం అధికార వర్గాలు వెల్లడించాయి.
కరోనా మహమ్మారి కారణంగా గతేడాది నుంచి ప్రయాణాలపై ఆంక్షలు (US travel restrictions) విధించింది అమెరికా. అప్పటి ట్రంప్ సర్కారు.. వైరస్ కట్టడికి తొలిసారి అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు అమలు చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్.. ఈ ఆంక్షలను కొనసాగించారు. అంతేగాక ఈ ఏడాది ఏప్రిల్‌లో భారత్ సహా అనేక దేశాలపై కొత్త ఆంక్షలు విధించారు.
ప్రస్తుతం కరోనా పరిస్థితులు మెరుగుపడినందున కొవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఇతర దేశాల పౌరులను దేశంలోకి అనుమతి ఇచ్చేందుకు అమెరికా నిర్ణయించింది.
ఇదీ చూడండి:- కొవిషీల్డ్‌ను యూకే ఆమోదించినా.. క్వారంటైన్‌లోనే భారత ప్రయాణికులు!