ETV Bharat / international

12ఏళ్లు దాటితే వ్యాక్సిన్‌.. కెనడా అనుమతి! - corona latest news

12 ఏళ్లు దాటిన పిల్లలకూ కొవిడ్​ టీకా ఇవ్వాలని నిర్ణయించింది కెనడా ప్రభుత్వం. ఇప్పటివరకు 16 ఏళ్లు పైబడిన వారికి టీకా ఇస్తుండగా.. ఇప్పుడు ఆ పరిమితిని తగ్గించింది. కరోనా నుంచి కాపాడేందుకు.. వారికి టీకా అత్యవసరమని ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

author img

By

Published : May 5, 2021, 9:42 PM IST

కరోనా వైరస్‌పై పోరాటంలో కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో 12 ఏళ్లు దాటిన పిల్లలకు కూడా టీకా ఇవ్వాలని నిర్ణయించింది. 12 నుంచి 15 ఏళ్ల వయసు కలిగిన పిల్లలకు ఫైజర్‌ వ్యాక్సిన్‌ మొదటి డోసు ఇచ్చేందుకు అనుమతిచ్చినట్టు ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. కరోనా మహమ్మారి నుంచి రక్షణలో ఆయా వయస్సు పిల్లలకు ఈ టీకా సురక్షితం, సమర్థంగా పనిచేస్తుందని క్లినికల్‌ ట్రయల్స్‌లో తేలినట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ సీనియర్‌ అడ్వైజర్‌ సుప్రియా శర్మ వెల్లడించారు.

జర్మనీకి చెందిన ఫైజర్​-బయోఎన్​టెక్ సంయుక్తంగా ఈ టీకాను అభివృద్ధి చేశాయి.

ఇదివరకు 16 అంతకంటే ఎక్కువ వయస్సున్న వారికే ఫైజర్​ టీకా వినియోగానికి అనుమతి ఉంది. అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్​డీఏ) కూడా వచ్చే వారం యువతకు.. ఈ టీకా అత్యవసర వినియోగానికి అనుమతినిచ్చే అవకాశాలున్నాయి.

కెనడాలో ఇప్పటివరకు 12,49,950 మందికి కొవిడ్‌ సోకగా.. వారిలో 20శాతం మంది 19 ఏళ్ల లోపువారే కావడం గమనార్హం. మొత్తం కొవిడ్‌ రోగుల్లో 11,42,854కోలు కోగా.. 24,396మంది మృతిచెందారు. ప్రస్తుతం అక్కడ 82,700 క్రియాశీల కేసులు ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.