అమెరికా దక్షిణ కాలిఫోర్నియాలో కార్చిచ్చు అంతకంతకూ విస్తరిస్తోంది. అగ్నికీలల ధాటికి సాన్ బెర్నార్డినోలో 8 భవనాలు దగ్ధమయ్యాయి. అక్కడ ఉన్న 500 ఇళ్లను ఖాళీ చేయించిన అధికారులు.. స్థానికులను సురక్షిత ప్రదేశాలకు తరలించారు.
లాస్ ఏంజిల్స్‌కు ఉత్తరాన ఉన్న శాంటా పౌలా ప్రాంతంలోని పర్వతంపై గురువారం సాయంత్రం కార్చిచ్చు ప్రారంభమైంది. ఫలితంగా సుమారు మూడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని అడవి అగ్నికి ఆహుతైంది. సమీపంలోని జురుపా లోయకూ మంటలు వ్యాపించి 150 ఎకరాల అడవి దగ్ధమైంది. అధికారులు ముందు జాగ్రత్తగా 3 వేల మంది స్థానికులను అక్కడి నుంచి తరలించారు.
వందలాది అగ్నిమాపక సిబ్బంది హెలికాప్టర్లు, బుల్డోజర్ల సహాయంతో కార్చిచ్చును అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఇదీ చూడండి: ఈ ఏడాది కేదార్నాథ్ యాత్రతో ఎంత లాభమో!