దయచేసి కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోండి... 116 మిలియన్ డాలర్ల (సుమారు రూ.840 కోట్ల) నగదును సొంతం చేసుకోండి.. అంటూ తమ రాష్ట్ర ప్రజలకు అమెరికాలోని కాలిఫోర్నియా సర్కారు లక్కీ డ్రా ప్రకటించింది! వచ్చేనెల 15న ఆంక్షలు ఎత్తివేసి, సాధారణ జీవనానికి మార్గం సుగమం చేయనున్న క్రమంలో- వ్యాక్సినేషన్‌ను(coronavirus vaccine) ముమ్మరం చేసేందుకు ఈ వినూత్న వ్యూహాన్ని అమలు చేస్తోంది. 12 ఏళ్లు దాటినవారంతా టీకా తీసుకోవాలని నెలల తరబడి ప్రచారం చేసినా, ఇప్పటివరకూ 3.4 కోట్ల మంది జనాభాలో 63% మందే వ్యాక్సిన్(coronavirus vaccine) వేయించుకున్నారు. మిగిలినవారికి వీలైనంత త్వరగా తొలి డోసు అందించేందుకు ‘ప్రైజ్ మనీ’ ఆఫర్‌ను గవర్నర్ గవిన్ న్యూసమ్ ప్రకటించారు. కనీసం తొలిడోసు తీసుకుంటే దీనికి అర్హత సాధించవచ్చు.
జూన్ 4తో లక్కీ డ్రా ప్రారంభమవుతుంది. జూన్ 4తో లక్కీ డ్రా ప్రారంభమవుతుంది. మొత్తం 10 మందికి 1.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.10.86 కోట్లు), 30 మందికి 50,000 డాలర్లు (రూ.36.21 లక్షలు) నగదు బహుమతులతో పాటు... 20 లక్షల మందికి 50 డాలర్ల (రూ.3,600) విలువైన గిఫ్ట్ కూపన్లు ఇస్తారు! ఇప్పటికే ఒహాయో, కొలరాడో, ఒరెగాన్ రాష్ట్రాలు ఇలాంటి ఆఫర్‌ను ప్రకటించాయి. ముఖ్యంగా యువతను ఆకట్టుకునేందుకు భారీ ఉపకారవేతనాలు, ఫీజుల చెల్లింపులు ప్రకటించాయి.
ఇదీ చూడండి: కొవిడ్‌కు డీఎన్ఏ ఆధారిత టీకా- తొలి ట్రయల్ సక్సెస్