నిత్యం రద్దిగా ఉండే మహానగరాల్లో ట్రాఫిక్ ఇక్కట్లు అంతా ఇంతా కాదు... కాలుష్యం కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీటికి ప్రత్యామ్నాయంగా అనేక దేశాల్లో ముఖ్య నగరాలను జోడిస్తూ మెట్రో రైళ్లు పరుగులు తీస్తుంటాయి. కానీ బొలీవియా మాత్రం ఆకాశ మార్గమైన కేబుల్ కార్లను తన ప్రధాన రవాణా వ్యవస్థల్లో ఒకటిగా చేసుకుంది.
బొలీవియాలో కేబుల్ కార్లు సందడి చేస్తున్నాయి. చివరి దశగా లా పాజ్ నుంచి ఎల్ ఆల్టో వరకు 33 కిలోమీటర్ల మేర నిర్మించిన కేబుల్ కార్ల ప్రాజెక్టు శనివారం అందుబాటులోకి వచ్చింది.
వీటిలో ప్రయాణం ఎంతో ప్రశాంతంగా ఉందని ప్రయాణికులు అంటున్నారు.
"ఇదొక మంచి ప్రత్యామ్నాయం. గమ్యస్థానాన్ని తొందరగా చేరుకోవచ్చు. ఎక్కువ బస్సులు మారాల్సిన అవసరం లేదు... పైగా బస్సులు రద్దీగా ఉంటాయి. కానీ కేబుల్ కార్లు ఎంతో ప్రశాంతం, సురక్షితం."
--- జౌన్ కార్లొస్, ప్రయాణికురాలు.
2014లో తొలిదశ కేబుల్ కార్లు వినియోగంలోకి వచ్చాయి. ఆస్ట్రియా కంపెనీ డాప్పెల్మైర్ నిర్మించిన ఈ రవాణా వ్యవస్థలో ఆ దేశ ప్రభుత్వం 740 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది. ఈ ప్రాజెక్టు పూర్తికావడానికి 7ఏళ్ల సమయంపట్టింది.