ETV Bharat / international

లోయలో పడిన బస్సు-31 మంది మృతి - బొలీవియా వార్తలు

Bus plunges into ravine in Bolivia
లోయలో పడిన బస్సు-31 మంది మృతి
author img

By

Published : Jul 13, 2021, 6:58 AM IST

Updated : Jul 13, 2021, 9:22 AM IST

06:55 July 13

లోయలో పడిన బస్సు

Bus plunges into ravine in Bolivia
బాధితులను ఆసుపత్రికి తరలిస్తున్న సిబ్బంది

బొలీవియాలోని చాటక్విలాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు అదుపు తప్పి లోయలో పడిన ఘటనలో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.  

100 మీటర్ల లోయలో పడిన బస్సును వెలికి తీసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉండవచ్చని అంచనా వేశారు.  

ప్రయాణికులకు తీవ్ర గాయాలు అవడం వల్ల మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.  

ఇదీ చదవండి : ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. 50 మంది మృతి

Last Updated : Jul 13, 2021, 9:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.