న్యూయార్క్ బఫెలో నగరానికి చెందిన ఆంటోనియో గ్విన్కు మరో బంపర్ ఆఫర్ వచ్చింది. ఆ స్థానిక నగరపాలక మేయర్ బైరాన్ బ్రౌన్.. పట్టణ భవన శాఖలో ఉద్యోగ అవకాశమిచ్చి గ్విన్ను ప్రశంసించారు.
గ్విన్కు ఎందుకిన్ని ఆఫర్స్....?
మినియాపోలిస్ నగర పోలీసుల చేతిలో నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ మరణించిన తరువాత అమెరికాలో నిరసనలు వెల్లువెత్తాయి. నిరసనలు ముగిశాక ఆందోళనకారులు ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. బఫెలో నగరం బెయిలీ అవెన్యూకు చెందిన 18 ఏళ్ల గ్విన్ మాత్రం ఆ నిరసనల కారణంగా రోడ్లపై మిగిలిన చెత్త, పగిలిన అద్దాల ముక్కలను గమనించాడు.
తన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న బాధ్యతతో అర్ధరాత్రి 2 గంటల సమయంలో చీపురు చేతబట్టి శుభ్రం చేయడం ప్రారంభించాడు గ్విన్. దాదాపు 10 గంటలు శ్రమించి.. నల్ల సంచుల్లో చెత్తను నింపేసి.. బెయిలీ అవెన్యూని మళ్లీ అందంగా మార్చేశాడు. ఇది చూసిన కొందరు.. వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.
గ్విన్ వీడియో చూసిన అధికారులు, నెటిజన్లు గ్విన్ను ప్రశంసల్లో ముంచేశారు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎదురు చూడక, స్వయంగా తన చేతులతో పనిని బాధత్యగా నిర్వర్తించాడు. దీంతో గ్విన్కు ఆఫర్లు వరుస కట్టాయి. గ్విన్ పనికి మెచ్చి ఒకరు 2004 ఫోర్డ్ మస్టాంగ్ కారును బహుకరిస్తే... మెడైల్లె కాలేజీ వారు గ్విన్ ఉన్నత చదువులకు సీటిచ్చి, పూర్తి స్కాలర్షిప్ ప్రకటించారు. ఇప్పుడు మేయర్ ఉద్యోగ అవకాశమిచ్చారు.
ఇదీ చదవండి:ట్రెండింగ్: పరీక్షలు రద్దు చేయండి ప్లీజ్!