కరోనా సోకిన వారు సాధారణంగా కొద్ది రోజులు ఆసుపత్రిలో ఉంటారు. కాస్త పరిస్థితి విషమంగా ఉంటే.. నెలపాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటారు. కానీ.. 2020మార్చిలో ఆసుపత్రిలో చేరిన ఓ వ్యక్తి ఏకంగా 243 రోజులు ఆసుపత్రిలోనే గడిపారు. అయినప్పటికీ.. మరణం ఆయన్ని వెంటాడింది.
కొవిడ్ వల్లేనా..!
నికోలస్ సిన్నొట్.. బ్రిటీష్ ఎయిర్వేస్లో పైలట్‌గా పనిచేసేవారు. 2020లో లండన్, హౌస్టింగ్ నుంచి ప్రయాణిస్తుండగా ఆయన కొవిడ్ బారినపడ్డారు. అప్పటినుంచి దాదాపు 8 నెలలు ఆసుపత్రిలో గడిపిన ఆయన అకస్మాత్తుగా మరణించారు. ఇందుకు గల కారణాలు ఇంకా తెలియనప్పటికీ.. కొవిడ్ అనంతర కారణాల వల్లే ఆయన మరణించి ఉంటారని వైద్యులు భావిస్తున్నారు. కరోనా వల్ల ఆయన శరీర భాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ముందే పేర్కొన్నారు.
నికోలస్ మృతి తమను ఆశ్చర్యానికి గురిచేసిందని బ్రిటీష్ ఎయిర్వేస్ డైరెక్టర్ కెప్టెన్ అల్ బ్రిడ్జర్ తెలిపారు. ఆయన ఓ మంచి పైలట్ అని గుర్తుచేసుకున్నారు.
నికోలస్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత డిసెంబర్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినప్పుడు.. తన భార్య సహకారంతోనే వైరస్‌ను జయించినట్టు చెప్పుకొచ్చారు నికోలస్.