బ్రెజిల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా కేసుల్లో రష్యాను దాటి ప్రపంచంలోనే రెండో స్థానానికి చేరింది బ్రెజిల్.
లాటిన్ అమెరికా దేశాల్లో కరోనాతో అత్యధికంగా ప్రభావితమైన దేశం బ్రెజిల్. శుక్రవారం నాటికి బ్రెజిల్లో 3,30,890 కేసులు నమోదవడం వల్ల.. 3లక్షల 26వేల కేసులున్న రష్యా మూడోస్థానానికి చేరింది. అమెరికా 16 లక్షల 45వేల కేసులతో మొదటి స్థానంలో ఉంది.
బ్రెజిల్లో కేవలం 24 గంటల్లో 1,001 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 21వేలు దాటింది.
ఓవైపు కేసుల సంఖ్య పెరుగుతున్నా.. కొద్ది రోజుల్లో దుకాణాలను తెరిచేందుకు అనుమతించారు రియో డి జనీరో నగర మేయర్. సావో పాలోలోనూ వ్యాపార కార్యకలాపాలు పునఃప్రారంభానికి సిద్ధమైంది అక్కడి ప్రభుత్వం. అయితే రోజు రోజుకూ పెరుగుతున్న కేసుల సంఖ్య, మరణాలను చూసి.. లాక్డౌన్ సడలించాలా వద్దా అనే సందిగ్ధంలో పడ్డాయి బ్రెజిల్ నగరాలు.
ఇదీ చదవండి:లాక్డౌన్ వేళ సంకెళ్లు తెంచుకున్న సృజన