బ్రెజిల్లో కరోనా మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కొవిడ్ మృతుల్లో ప్రపంచంలోనే రెండో స్థానానికి చేరుకోవడమే ఇందుకు నిదర్శనం. బుధవారం ఒక్కరోజే 2,009 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల్లో మూడు లక్షల మార్కును చేరుకుంది బ్రెజిల్. అమెరికా ఈ మార్కును డిసెంబరు 14న దాటేసింది.
బ్రెజిల్లో మంగళవారం రికార్డు స్థాయి మరణాలు నమోదయ్యాయి. ఆ ఒక్కరోజే 3,251 మంది చనిపోయారు. అయితే ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించిన కరోనా మృతుల సంఖ్య తప్పు అని ఆరోపిస్తోంది అక్కడి మీడియా.
75 రోజుల్లో లక్ష మంది
75 రోజుల్లోనే 1,00,000 మంది చనిపోవడం.. అక్కడి కరోనా తీవ్రతకు అద్దం పడుతోంది. రాజకీయ సమన్వయం లేకపోవడం సహా కొత్త రకం వైరస్ విపరీతంగా వ్యాపిస్తోందని వైద్య నిపుణులు ఆరోపిస్తున్నారు. మరోవైపు వచ్చే నెలలోనూ పరిస్థితి మరింత తీవ్రమవుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: లంకకు భారత్ దన్ను- గైర్హాజరు వ్యూహాత్మకం!