ETV Bharat / international

టీకా తీసుకోలేదని దేశాధ్యక్షుడినే ఆపేశారు!

కరోనా నిబంధనల కారణంగా సాకర్ మ్యాచ్​ను(Brazil Championship) తాను చూడలేకోపోయానని బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాక్సిన్​ వేసుకోకపోవడం వల్ల తనను అధికారులు స్టేడియంలోకి అనుమతించలేదని ఆరోపించారు.

brazil president
బ్రెజిల్ అధ్యక్షుడు
author img

By

Published : Oct 11, 2021, 12:30 PM IST

కరోనా నిబంధనలు ఉల్లంఘించి పలుమార్లు విమర్శలపాలైన బ్రెజిల్​ అధ్యక్షుడు జైర్​ బొల్సొ​నారో.. తాజాగా మరోసారి కొవిడ్​ నిబంధనలపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. సాకర్ మ్యాచ్​లు చూడాలనుకున్న తాను కరోనా నిబంధనల కారణంగా వెళ్లలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ తీసుకోకపోవడం వల్ల సాంటోస్​ నగరంలో జరిగిన 'బ్రెజిలియన్ ఛాంపియన్ షిప్​'(Brazil Championship) మ్యాచ్​ను చూసేందుకు తనను అధికారులు అనుమతించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

"వ్యాక్సిన్ తీసుకున్నట్లుగా ధ్రువపత్రం ఉండాలా? నేను సాంటోస్​కు వెళ్లి మ్యాచ్​లు చూడాలనుకున్నాను. కానీ, అందుకు వ్యాక్సిన్​ వేసుకొని ఉండాలని వాళ్లు చెప్పారు. మ్యాచ్​ చూడాలంటే.. వ్యాక్సిన్​ తీసుకోవడం ఎందుకు?

-జైర్ బొల్సొనారో, బ్రెజిల్ అధ్యక్షుడు

అయితే.. మ్యాచ్​కు హాజరవుతానని బొల్సొనారో తమను సంప్రదించలేదని సాంటోస్ అధికారులు చెప్పడం గమనార్హం.

ఇవీ చూడండి:

'రష్యా, చైనా చేతికి అఫ్గాన్​లోని అమెరికా ఆయుధాలు'

నడిసంద్రంలో శిశువు జననం.. 9 గంటలపాటు చిన్న బోటులో..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.