ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తోంది. అమెరికాలో రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు ఉండగా.. ఇప్పుడు బ్రెజిల్లోనూ కరోనా మృతుల సంఖ్య లక్ష దాటింది. మే నెలాఖరు నుంచి ఈ దేశంలో రోజుకు సగటున 1,000 కరోనా మరణాలు సంభవిస్తున్నాయి.
మొత్తం 3,013,369 కేసులు, 100,543 మరణాలతో బ్రెజిల్ ప్రస్తుతం ప్రపంచలోనే రెండో స్థానంలో ఉంది. 5,149,723 కేసులు, 165,070 మరణాలతో అమెరికా తొలి స్థానంలో ఉంది.
అయితే బ్రెజిల్ చెబుతున్న కరోనా కేసులు, మరణాల లెక్కలను అమెరికా సహా పలు దేశాలు తప్పుబడుతున్నాయి. సరిపడా టెస్టులు చేయకుండా.. తప్పుడు లెక్కలు చూపిస్తున్నట్లు ఆరోపిస్తున్నాయి. బ్రెజిల్లో నిజానికి ఇంకా భారీగా కరోనా కేసులు, మరణాలు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
అమెరికా, బ్రెజిల్ తర్వాతి స్థానాల్లోని దేశాలు ఇవే..
దేశం | కేసులు | మరణాలు |
రష్యా | 882,347 | 14,854 |
దక్షిణాఫ్రికా | 553,188 | 10,210 |