ETV Bharat / international

ట్రంప్​తో ఆయన సతీమణి బేరసారాలు.. ఆ పుస్తకంలో ఏముంది?

author img

By

Published : Jun 13, 2020, 9:47 PM IST

Updated : Jun 13, 2020, 10:03 PM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ సతీమణి మెలానియా ట్రంప్​కు సంబంధించిన కీలక వ్యక్తిగత విషయాలను ఓ పుస్తకం వెల్లడించింది. 2016 ఎన్నికల్లో ట్రంప్​ విజయం సాధించాక ఆయనతో పాటు వాషింగ్టన్​కు వచ్చేందుకు ఆర్థిక ప్రయోజనాలు పొందెలా వివాహ ఒప్పందాన్ని మెలానియా మార్పించినట్లు బహిర్గతం చేసింది. శ్వేతసౌధం మాత్రం ఈ పుస్తకం తప్పులతడక అని కొట్టి పారేసింది.

new-prenup
సతీమణి బేరసారాలు

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత డొనాల్డ్​ ట్రంప్​తో ఆయన సతీమణి మెలానియా ట్రంప్ బేరసారాలాడినట్లు వాషింగ్టన్​ పోస్ట్ రిపోర్టర్​ రచించిన పుస్తకం బహిర్గతం చేసింది. 2016లో ట్రంప్ బాధ్యతలు చేపట్టాక ఆయనతో ఉండేందుకు వాషింగ్టన్ రావడానికి ఆర్థిక ప్రయోజనాలు పొందేలా మెలానియా చర్చలు జరిపినట్లు పేర్కొంది. 2017లో ఆమె వాషింగ్టన్ రావడానికి ఆలస్యం చేసినట్లు వెల్లడించింది. ట్రంప్​తో వివాహానికి పూర్వం జరిగిన ఒప్పందానికి మార్పులు చేసిన తర్వాతే మెలానియా తుది నిర్ణయం తీసుకున్నట్లు పుస్తకం వివరించింది. ఆలస్యం చేయడానికి తన కుమారుడు బ్యారన్​ పాఠశాల సంవత్సరం పూర్తయ్యే వరకూ వేచి చూసేలా మెలానియా చేశారని రచయిత పేర్కొన్నారు.

వాషింగ్టన్​ పోస్ట్ రిపోర్టర్​ మేరీ జోర్డన్ ' ది ఆర్ట్​ ఆఫ్ హర్ డీల్​: ది అన్​టోల్డ్ స్టోరీ ఆఫ్ మెలానియా' పేరిట ఈ పుస్తకాన్ని రాశారు. జూన్ 16న అధికారికంగా బయటకు రావాల్సిన ఈ పుస్తకాన్ని ముందుస్తు కాపీని అసోసియేటెడ్​ ప్రెస్​ కొనుగోలు చేసి బహిర్గతం చేసింది.

మెలానియాకు సంబంధించి పుస్తకంలో తెలిపిన పలు కీలక విషయాలు..

  • 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్​పై వచ్చిన ఆరోపణల గురించి మీడియాలో వచ్చిన వార్తల ద్వారా మెలానియాకు కొత్త విషయాలు తెలిశాయి.
  • తన కుమారుడు, తాను భవిష్యత్తులో ఎలాంటి ఆర్థిక లోటు లేకుండా ఉండేలా చూసుకోవాలని మెలానియా భావించారు.
  • ఆర్థికపరమైన ఏర్పాట్లకు సంబంధించి ట్రంప్​తో వివాహానికి పూర్వం జరిగిన ఒప్పందానికి మార్పులు జరిగేలా చేశారు మెలానియా.
  • తనతో ఒప్పందం కుదిరాకే ట్రంప్​ జీవితంలో ఎంతో మార్పు వచ్చిందని ఎన్నికల ప్రచారం సందర్భంగా మెలానియా అనుకున్నారు.
  • ట్రంప్​తో ఎక్కువ కాలం కలిసున్న మహిళ కూడా మెలానియానే. ఆయన విజయంలో తనకు కీలక పాత్ర ఉన్నట్లు సన్నిహితులతో మెలానియా చెప్పారు.
  • అధ్యక్షుడయ్యాక తన వ్యాపార సంస్థలను పర్యవేక్షించే తీరిక ట్రంప్​కు లేకుండా పోయింది. ఒకవేళ ఆ బాధ్యతలను ట్రంప్​ కూతురు ఇవాంక చేపడితే, వారసుడైన తన కొడుకు బ్యారన్(11)కు దక్కాల్సిన వాటా దక్కేలా చూడాలని మెలానియా కోరారు. తనకు, తన కుమారుడికి కలిపి ట్రంప్​తో భారీ ఆర్థిక ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఈ వివరాలు సేకరించేందుకు మెలానియా సొంత ప్రాంతమైన స్లొవేనియాలో ఆమెతో కలిసి చదువుకున్న వారు, న్యూ జెర్సీ మాజీ గవర్నర్​ సహా 100 మందితో ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు చెప్పారు జోర్డన్.

ట్రంప్​ ముగ్గురు పిల్లల కంటే బ్యారన్​కే అధిక ప్రాధాన్యం ఉండేలా మెలానియా పట్టుబట్టారని జోర్డన్ తెలిపారు. కుటుంబ వ్యాపారాలు, ట్రంప్​ సంస్థలలో అవకాశాలు, ఆస్తులలో తన కుమారిడికి వాటా ఉండేలా మెలానియా కోరినట్లు చెప్పారు. అలా అయితే స్లొవేనియా పౌరసత్వం ఉన్న తన కుమారడు బ్యారన్​కు భవిష్యత్తులో ఐరోపాలో ట్రంప్​ వ్యాపారాలను నిర్వహించే మంచి అవకాశాలు వస్తాయని మెలానియా వ్యూహరచన చేశారు.

తప్పులు..

ఈ పుస్తకంలో ఉంది కచ్చితమైన సమాచారం కాదని, మోలానియాకు సంబంధించి తప్పుడు వివరాలతో మరో పుస్తకం బయటకొచ్చిందని ఆమె అధికార ప్రతినిధి స్టిఫెనీ గ్రీషమ్ అన్నారు.

Last Updated : Jun 13, 2020, 10:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.