ఇరాన్‌పై సైనిక దాడిని ఉపసంహరించుకున్న అమెరికా అధ్యక్షుడి నిర్ణయాన్ని ట్రంప్ బలహీనతగా ఇరాన్ ప్రచారం చేసుకోవద్దని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం అలాంటి ప్రచారం ఆపేయాలని ఇరాన్ అధికారులను హెచ్చరించారు బోల్టన్.
"మధ్యప్రాచ్యంలో వేటకు ఇరాన్‌కు ఎవరూ లైసెన్స్ ఇవ్వలేదు. మా సైన్యం పునరుత్తేజం పొంది అన్నింటికీ సిద్ధంగా ఉంది. ఇరాన్‌పై రాగల కొన్ని వారాల్లో విధించేందుకు ట్రంప్ ప్రతిపాదించిన నూతన ఆంక్షలపై సోమవారం ప్రకటన చేస్తాం. వేచి చూడండి."
- జాన్ బోల్టన్, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు
జెరూసలెంలో ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహుతో సమావేశానికి ముందు బోల్టన్ ఈ వ్యాఖ్యలు చేశారు.