ETV Bharat / international

కరోనా టీకాతో ఎయిడ్స్​కు ముడిపెట్టిన అధ్యక్షుడిపై దర్యాప్తు - బొల్సొనారో వ్యాక్సిన్​ న్యూస్​

Bolsonaro comments on vaccine: కొవిడ్​ టీకాలు తీసుకుంటే ఎయిడ్స్​ సోకే ముప్పు ఎక్కువగా ఉందంటూ.. బ్రెజిల్​ అధ్యక్షుడు బొల్సొనారో చేసిన వ్యాఖ్యలు గతంలో చర్చనీయాంశమయ్యాయి. తాజాగా.. ఈ వ్యాఖ్యలపై దర్యాప్తు చేపట్టాలని ఆదేశించింది బ్రెజిల్​ సుప్రీంకోర్టు.

Bolsonaro comments on vaccine
'కరోనా టీకాతో ఎయిడ్స్​'.. అధ్యక్షుడిపై దర్యాప్తు
author img

By

Published : Dec 4, 2021, 10:03 AM IST

Bolsonaro vaccine news: బ్రెజిల్​ అధ్యక్షుడు బొల్సొనారో చిక్కుల్లో పడ్డారు. కరోనా టీకాలు, ఎయిడ్స్​కు ముడిపెడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలపై దర్యాప్తు చేపట్టాలని ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్​ అలెగ్జాండర్​ డీ మోరేస్​.. ప్రాసిక్యూటర్​ అగస్టో ఆరస్​కు సూచించారు.

అక్టోబర్​ 24న మీడియాతో మాట్లాడుతూ.. "పూర్తిస్థాయిలో వ్యాక్సిన్​ తీసుకున్న ప్రజలు.. ఎయిడ్స్​ బారినపడే ముప్పు ఎక్కువగా ఉందని బ్రిటన్​ ప్రభుత్వం రూపొందించిన నివేదికలో బయటపడింది," అని బొల్సొనారో అన్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. వెంటనే ఆ వీడియోను ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్​లు తొలగించాయి.

అయితే అధ్యక్షుడిపై దర్యాప్తు జరగడం ప్రశ్నార్థకమే. కరోనా మహమ్మారి నిర్వహణలో బొల్సొనారోపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ఆయనపై విచారణ జరపాలని సెనేట్​ కమిటీ అనేకమార్లు డిమాండ్​ చేసింది. వాటిని ఆరస్​ పట్టించుకోలేదు.

వివాదాల్లో చిక్కుకోవడం బొల్సొనారోకు ఇది కొత్తేమీ కాదు. కొవిడ్​ నిబంధనలను ఆయన పాటించరు. ఇప్పటికీ కొవిడ్​ టీకా తీసుకోలేదు. లాక్​డౌన్​ ఆంక్షలకు తీవ్రంగా వ్యతిరేకించారు.

కరోనా మరణాల్లో బ్రెజిల్​ ప్రస్తుతం ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. ఆ దేశంలో 6లక్షలకుపైగా మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇవీ చూడండి:-

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.