అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ-అమెరికన్ ట్రెండ్ నడుస్తోంది. ఎన్నికలకు మరో 50 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో భారత సంతతి ఓటర్లను ఆకర్షించేందుకు రిపబ్లికన్లు, డెమొక్రాట్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్ ప్రచారంలో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరో పాట రీమిక్స్‌ను విడుదల చేశారు ఆయన మద్దతుదారులు.
బాలీవుడ్ సూపర్‌హిట్ చిత్రం 'లగాన్'లోని 'ఛలే ఛలో' పాటను ఇందుకు ఉపయోగించారు. "ఛలే ఛలో.. ఛలే ఛలో.. బైడెన్ కో ఓట్ దో, బైడెన్ కి జీత్ హో.. ఉన్కి హార్ హా" అంటూ సాగే ఈ రీమిక్స్ పాటను సిలికాన్ వ్యాలీకి చెందిన బాలీవుడ్ గాయకుడు తిట్లీ బెనర్జీ పాడారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
బైడెన్-హారిస్‌కు మద్దతుగా..
ప్రముఖ వ్యాపారవేత్తలు, భారతీయ అమెరికన్ దంపతులు అజయ్-వినితా భుటోరియా ఈ పాటను విడుదల చేశారు. "ఇది ఒక పోరాట గీతం. నవంబరులో బైడెన్-హారిస్‌కు మద్దతుగా నిలిచి ఓటు వేసేందుకు భారతీయ సమాజాన్ని ప్రేరేపిస్తుంది" అని అజయ్ పేర్కొన్నారు.
బైడెన్-హారిస్‌కు మద్దతుగా అజయ్ విడుదల చేసిన రెండో వీడియో ఇది. భారత్, జమైకా సంతతికి చెందిన కమలా హారిస్‌కు ఇండో అమెరికన్ మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు అజయ్ తెలిపారు. బైడెన్-హారిస్ జోడికి దక్షిణాసియా ఓటర్లలో 80 శాతం మద్దతు ఉందని అన్నారు.
కీలక రాష్ట్రాల్లో..
అమెరికాలో నవంబర్ 3న అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అమెరికాలో సుమారు 25 లక్షల మంది భారత సంతతి ఓటర్లు ఉన్నారు. ముఖ్యమైన రాష్ట్రాల్లో గెలుపోటముల్లో భారతీయ అమెరికన్ ఓటర్ల పాత్ర కీలకంగా ఉండనుంది. ఈ రాష్ట్రాల్లోనే 13 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.
ఇదీ చూడండి: ఉపాధ్యక్ష అభ్యర్థిగా కమల ఎంపికకు కారణాలేంటి?