ETV Bharat / international

బైడెన్​ జట్టులో మరో ముగ్గురు భారతీయ అమెరికన్లు - అమెరికా జాతీయ భద్రతా కౌన్సిల్​లో ఇద్దరు భారతీయ సంతతి అమెరికన్​లకు చోటు

అమెరికా జాతీయ భద్రతా మండలి​లో ఇద్దరు భారతీయ అమెరికన్లకు స్ధానం లభించింది. అంతేకాకుండా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్​కు డిప్యూటీ ప్రెస్​ సెక్రటరీగా మరో భారత సంతతి అమెరికన్​ మహిళ నియమితులయ్యారు.

Biden's team includes three other Americans of Indian descent
బైడన్​ జట్టులో మరో ముగ్గురు భారత సంతతి అమెరికన్లు
author img

By

Published : Jan 9, 2021, 5:12 AM IST

అమెరికా జాతీయ భద్రతా మండలి​లో ఇద్దరు భారతీయ అమెరికన్ల పేర్లను ప్రకటించారు అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్​. దక్షిణాసియా సీనియర్​ డైరక్టర్​గా సుమొనా గుహాను, టెక్నాలజీ, జాతీయ భద్రతకి డైరక్టర్​గా తరుణ్​ ఛబ్రను.. బైడన్​ నియమించారు. మరోవైపు.. అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్​కు డిప్యూటీ ప్రెస్​ సెక్రటరీ గా భారత సంతతి అమెరికన్​ సబ్రిన సింగ్​ నియమితులయ్యారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో కమలా హారిస్​కు సబ్రిన్ ప్రెస్​ సెక్రటరీగా వ్యవహరించారు.

బైెడెన్​-హారిస్​ అధ్యక్ష ఎన్నికల ప్రచారం సమయంలో దక్షిణాసియా విదేశాంగ వ్యవహారాల కార్యనిర్వాహక బృందానికి ఉపాధ్యక్షురాలిగా గుహ వ్యవహరించారు. అంతేకాకుండా ఒబామా ప్రభుత్వంలో ఉపాధ్యక్షుడు బైడెన్​కు జాతీయ భద్రత వ్యవహారాల ప్రత్యేక సలహాదారుగా ఈమె ఉన్నారు. ఒబామా ప్రభుత్వంలో జాతీయ భద్రతా కౌన్సిల్​లో చబ్రా పనిచేశారు.

ఇదీ చూడండి: బైడెన్ ప్రమాణ స్వీకారానికి నేను రాను: ట్రంప్​

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.