ETV Bharat / international

బైడెన్​ ప్రచారంపై సొంత పార్టీలోనే కలవరం ! - రిపబ్లికన్లు

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం ఎప్పుడూ హోరాహోరీగానే సాగుతుంది. ప్రస్తుతం తుది అంకానికి చేరుకుంటున్న ప్రచార పర్వంలో... డొనాల్డ్​ ట్రంప్​-జో బైడెన్​ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. అయితే, ట్రంప్​ సుడిగాలి పర్యటనలతో హోరెత్తిస్తుండగా.. ఆచితూచి అన్నట్లు సాగుతోన్న బైడెన్​ ప్రచార పంథా డెమొక్రాట్లను కాస్త కలవరపెడుతోంది.

Biden's low-key
బైడెన్​ ప్రచారం.. సొంత పార్టీలోనే కలవరం !
author img

By

Published : Sep 27, 2020, 7:13 PM IST

సాధారణంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో చివరి అంకం రసవత్తరంగా ఉంటుంది. క్షేత్రస్థాయి పర్యటనలు, ర్యాలీలు, వాడీవేడి సంవాదాలు, ఉద్విగ్న ప్రసంగాలు.. ఇలా అభ్యర్థులు పదునైన వ్యూహాలతో, గెలుపు అస్త్రాలతో నువ్వా-నేనా అన్నట్లు ప్రజాక్షేత్రంలో తలపడతారు. కానీ, కరోనా విలయంతో అమెరికా సారథిని నిర్ణయించే ఎన్నికలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ముఖ్యంగా ట్రంప్​ను సవాలు చేస్తున్న జో బైడెన్​ను ప్రచారంలో వెనుకంజ వేయిస్తోంది కరోనా.

ఆగస్టు 11న ఉపాధ్యక్ష అభ్యర్థిగా భారత మూలాలున్న​ కమలా హ్యారిస్​ను ఎన్నుకున్న తర్వాత బైడెన్​ ప్రచారం పూర్తిగా మందగించిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. బహిరంగ సమావేశాలు తగ్గిపోగా.. డిజిటల్ ఫండ్ రైజింగ్​ కార్యక్రమాలకు, లేదంటే సొంత రాష్ట్రం డెలావేర్​లో చర్చి​ ప్రార్థనలకే బైడెన్​ పరిమితమయ్యారని చెబుతున్నారు పరిశీలకులు.

బైడెన్​... 22 రోజుల వ్యవధిలో స్వరాష్ట్రం వదిలి 12 సార్లు మాత్రమే బయటకు వచ్చారని.. అదే సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ 24 సుడిగాలి పర్యటనలు చేశారని చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రచారంలో భాగంగా ట్రంప్​ 17 రాష్ట్రాలు చుట్టేశారు.

ఇదీ చూడండి: ట్రంప్​ వెంటే ఇండో-అమెరికన్లు.. తేల్చిన సర్వే

అయితే, బైడెన్​ వ్యూహాత్మకంగానే ఇలా వ్యవహరిస్తున్నారని అంటున్నారు ఆయన మద్దతుదారులు. కరోనా వేళ వైరస్​ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వ నియమాలు పాటిస్తూ డిజిటల్​ ప్రచారాలకు మొగ్గుచూపుతున్నారని వాదిస్తున్నారు. అదే సమయంలో ట్రంప్​ భారీ ప్రచార ర్యాలీలు నిర్వహిస్తూ.. కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, స్థానిక అధికారులకు సమస్యలు సృష్టిస్తున్నారని విమర్శిస్తున్నారు.

మా ప్రచార వ్యూహాం సురక్షితంగా, అదే సమయంలో ప్రభావితంగా ఉంటుంది. మా సందేశం ఓటర్లకు చేరువవుతోంది. ప్రజల్లోంచే ట్రంప్​ను ఓడించేందకు ఉత్సాహం, చైతన్యం వస్తున్నాయి.

-టీజే డక్లో, బైడెన్​ అధికార ప్రతినిధి

ఇదీ చూడండి: 'అమెరికా అభివృద్ధిలో భారతీయులదే కీలక పాత్ర'

బైడెన్​ ప్రచారంలో మరింత జోష్​ ఉండాలని చెబుతున్నారు కొంతమంది డెమొక్రాట్లు. టెక్సాస్​, ఆరిజోనా వంటి రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించినట్లైతే లాటిన్​ ఓటర్లను ఆకట్టుకునే అవకాశముందంటున్నారు. పర్యటనలు కొంత ఒత్తిడి తగ్గిస్తాయని వారు అభిప్రాయపడుతున్నారు.

ప్రచారంలో పాల్గొనకపోవటానికి కరోనాను కారణంగా చూపటం సరికాదు. బైడెన్​ వద్ద సొంత విమానం ఉంది. పర్యటనల కోసం ప్రయాణానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.

-గిల్బెర్టో హినొజోసా, డెమొకట్రిక్​ పార్టీ నేత

Biden
సర్వశక్తులూ ఒడ్డుతున్న డొనాల్డ్​ ట్రంప్​-జో బైడెన్

కొన్ని నెలల పాటు బైడెన్​-ట్రంప్​ మధ్య ప్రచార పర్వం పోటాపోటీగానే సాగింది. బైడెన్​ జాతీయ పోల్స్​లో మొదటినుంచి ఆధిక్యం కనబరుస్తున్నారు. అయితే, ఫలితాలు నిర్ణయించే కొన్ని కీలక రాష్ట్రాల్లో స్వల్ప ఆధిక్యమే ఉంది. ఈ నేపథ్యంలో డెమొక్రాట్లపై 2016లోనూ ఇలాంటి అంచనాలే వచ్చినా.. ఫలితాల నాటికి పూర్తిగా తారుమరయ్యాయని గుర్తు చేస్తున్నారు విశ్లేషకులు.

మరోవైపు తమ ప్రచార శైలి ఓటర్లను ఎలా ప్రభావితం చేస్తుందనేది తేల్చుకోలేకపోతున్నారు డెమొక్రాట్లు. బైడెన్​ నిదానమే ప్రధానం అన్నట్లు వ్యవహరిస్తుండటం, నల్లజాతీయుల సమస్యలు, సుప్రీం కోర్టు తీర్పులపై వివాదాలు.. వంటి అంశాలపై సరైన విధంగా స్పందించట్లేదని, ఇంటర్వ్యూలకే పరిమితవుతున్నారని వాపోతున్నారు. తన వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లలేకపోతున్నారని అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటికేతే బైడెన్​ ప్రజల్లోకి వెళ్లిన ప్రతిసారి కరోనా వ్యాప్తిని అడ్డుకోవటంలో ట్రంప్​ ప్రభుత్వం విఫలమైందని, కేసుల లెక్కలు దాచేస్తోందని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పర్యటనల ద్వారా ఆయన వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగితే.. ఫలితాలు ప్రభావితమయ్యే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు పరిశీలకులు.

అయితే, బైడెన్​ పర్యటనలు చేపట్టకున్నా.. శక్తిమంతమైన ప్రచారమే చేస్తున్నారు. వర్చువల్​ కార్యక్రమాల ద్వారానే ఆయన దాదాపు 363 మిలియన్​ డాలర్ల నిధులు సమకూర్చుకున్నారు. ప్రజల మద్దతు భారీగా ఉందన్న సందేశాన్ని ఇలా రిపబ్లికన్లు ఇస్తున్నారని మద్దతుదారులు చెబుతున్నారు.

అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ మాత్రం... తన సుడిగాలి పర్యటనలతో ప్రజల్లోకి వెళ్తూ వారిని ఆకట్టుకోవటంలో బైడెన్​ కంటే ఎంతో ముందున్నారని రిపబ్లికన్లు చెబుతున్నారు.

ఇదీ చూడండి: రష్యాతో సంబంధం వాళ్లకు.. నిందలు నాపై: ట్రంప్

ఇదీ చూడండి: ట్రంప్ ప్లాన్​- బీ: నల్లజాతీయులకు భారీ హామీలు

ఇదీ చూడండి: ఎన్నికల ఫలితాన్ని ట్రంప్​ అంగీకరిస్తారు... కానీ...'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.