ETV Bharat / international

కొవిడ్​ అత్యవసర సాయం ఆమోదానికి బైడెన్​ పట్టు! - కొవిడ్​ సాయం

కొవిడ్​-19 అత్యవసర సాయం నిధులకు ఆమోద ముద్ర వేయించుకోవాలని కాంగ్రెస్​పై ఒత్తిడి తెస్తున్నారు అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్​. వచ్చే లేమ్​-డక్​ సెషన్​లోనే ఆమోదింప చేసుకోవాలని పట్టుదలతో ఉన్నారు. సెనేట్​, ప్రతినిధుల సభల్లోని పలవురు సీనియర్​ డెమొక్రటిక్​ సభ్యులతో సమావేశమై చర్చించారు.

Jeo Biden
జో బైడెన్
author img

By

Published : Nov 21, 2020, 7:35 AM IST

కొవిడ్​-19ను కట్టడి చేయటమే తమ తొలి ప్రాధాన్యంగా ప్రకటించిన అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్​.. ఆ దిశగా చర్యలు చేపట్టారు. అధికార పగ్గాలు చేపట్టేలోపే కరోనా అత్యవసర సాయం కింద నిధులకు కాంగ్రెస్​ ఆమోద ముద్ర వేయించాలని పట్టుదలతో ఉన్నారు. కొద్ది రోజుల్లో జరగనున్న 'లేమ్​-డక్​ సెషన్'( కొత్త అధ్యక్షుడి ఎన్నిక తర్వాత.. అధికారం చేపట్టేలోపు కాంగ్రెస్​ భేటీ)​లో ఈ ప్రత్యేక ప్యాకేజీకి ఆమోదం లభించేలా చూడాలని సెనేట్​, ప్రతినిధుల సభల్లోని పలువురు సీనియర్​ డెమొక్రటిక్​ సభ్యులతో సమావేశం సందర్భంగా స్పష్టం చేశారు.

అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తొలిసారి స్పీకర్​ నాన్సీ పెలోసీ, సెనేట్​ డెమొక్రటిక్​ నాయకుడు చక్​ షుమెర్​​లతో నేరుగా భేటీ అయ్యారు బైడెన్​. మరో కరోనా సాయం బిల్లుకు ఆమోదం పొందేందుకు బైడెన్​ కొత్త పరిపాలన విభాగం విస్తృత ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా వ్యాక్సిన్​ పంపిణీకి సమగ్ర ప్రణాళికను రూపొందించింది.

" లేమ్​-డక్​ సెషన్​లో బహుళ ప్రయోజన అత్యవసర సహాయ ప్యాకేజీకి కాంగ్రెస్​ తప్పనిసరిగా ఆమోదం తెలపాల్సిన అవసరం ఉందని మా బృందం అంగీకరించింది. ఇందులో కొవిడ్​పై పోరాటానికి కావాల్సిన వనరులు, కార్మిక కుటుంబాలు, చిన్న వ్యాపారాలకు ఉపశమనం, క్షేత్రస్థాయి సిబ్బందిని విధుల్లో ఉంచేందుకు రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలకు మద్దతు, నిరుద్యోగ బీమా పొడగింపు, లక్షలాది కుటుంబాలకు సరసమైన వైద్య సదుపాయల కల్పన ఉండాలి."

- జో బైడెన్​, అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత

బైడెన్​, షుమెర్​తో సమావేశానికి ముందు కీలక వ్యాఖ్యలు చేశారు స్పీకర్​ పెలోసీ. వైరస్​ను నిర్మూలించాల్సిన ఆవశ్యకత, కొవిడ్​-19 సాయం, ప్రభుత్వానికి నిధులపై కావాల్సిన చట్టాల ఆమోదానికి లేమ్​-డక్​ సెషన్​ను ఏ విధంగా వినియోగించుకోవాలనేదానిపై కీలకంగా చర్చించనున్నట్లు చెప్పారు. ఈ అంశాలపై సెనేట్​ మెజారిటీ నాయకుడు మిచ్​ మక్కన్నేల్​, జీఓపీ నాయకత్వంతో గురువారం చర్చలు జరిపినట్లు తెలిపారు. అయితే.. కొవిడ్​ సాయం ప్యాకేజీపై వారితో ఏకాభిప్రాయం కుదరలేదని తెలిపారు.

ఇదీ చూడండి:అగ్రరాజ్యంలో కరోనా 2.0 విలయం- అసలేం జరుగుతోంది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.