ETV Bharat / international

'మే చివరినాటికి వయోజనులందరికీ కరోనా టీకా' - అమెరికాలో అందరికీ కరోనా టీకా

తమ దేశంలోని వయోజనులందరికీ.. మే చివరినాటికి కరోనా టీకా అందిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ తెలిపారు. ఈ మేరకు తగినన్ని టీకాలను పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.

Biden vows enough vaccine for all US adults by end of May
'మే చివరినాటికి వయోజనులందరికీ కరోనా టీకా'
author img

By

Published : Mar 3, 2021, 7:22 AM IST

గతంలో ఆశించిన దాని కన్నా రెండు నెలల ముందే మే చివరి నాటికి తమ దేశంలో వయోజనులకు అందించేందుకు తగినన్ని కరోనా వ్యాక్సిన్‌లు సరఫరా చేస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తెలిపారు. ఫార్మసీ ప్రోగ్రాం ద్వారా నేరుగా డోసులను అందిస్తామని వెల్లడించారు. రాబోయే వారాల్లో కరోనా వ్యాక్సిన్‌ సరఫరాను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్రాల గవర్నర్‌లకు బైడెన్‌ ప్రభుత్వం సూచించింది.

దేశవ్యాప్తంగా మరిన్ని పాఠశాలలను తిరిగి తెరవడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా మార్చి చివరి నాటికి.. కనీసం ఒక టీకా డోసును విద్యావంతులందరికీ పంపిణీ చేయాలని రాష్ట్రాలకు సూచించారు బైడెన్​. ఇందులో ఉపాధ్యాయులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.

రాష్ట్రాలకు ప్రతి వారం 14.5 మిలియన్‌ డోసుల చొప్పున సరఫరా చేస్తుండగా, వచ్చే వారం ఆ సంఖ్యను 15.2 మిలియన్లకు పెంచుతామని వెల్లడించింది. అత్యవసర వినియోగానికి జాన్సన్‌ అండ్ అమ్‌ప్‌ టీకాకు అనుమతి లభించగా.. ఆ కంపెనీకి అసాధారణ పంపిణీ ఆర్డర్‌లు వచ్చినట్లు అమెరికా ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది జూన్‌ చివరి నాటికి వంద మిలియన్ డోసులు పంపిణీ చేస్తామని ఆ కంపెనీ హామీ ఇచ్చినట్లు వెల్లడించింది.

ఇదీ చూడండి: ఆందోళనలు ఉన్నా.. చైనా వ్యాక్సిన్లకు తగ్గని గిరాకీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.