అమెరికాలో వ్యాక్సినేషన్ (US Vaccination news) వేగవంతం చేసేందుకు జో బైడెన్ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు టీకా తప్పనిసరి అనే నిబంధనను (US Vaccine mandate) ఇటీవలే తీసుకొచ్చారు బైడెన్. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ వ్యాక్సిన్లు అందించాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ (Biden Vaccine Executive Order) ప్రకారం నవంబరు 22 నాటికి దాదాపు 40 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
శ్వేతసౌధంలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో చాలా మందికి ఇప్పటికే వ్యాక్సినేషన్ పూర్తైంది. కానీ.. నిఘా, భద్రతా విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో వ్యాక్సినేషన్ రేటు తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ఉద్యోగులకు టీకా పంపిణీ (US Vaccine mandatedeadline ) పూర్తి చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. దేశంలోని ప్రజలు టీకా తీసుకోవాలని బైడెన్ ఒప్పించాలంటే.. ముందుగా ప్రభుత్వ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. బైడెన్‌కు ఇది పరీక్ష వంటిదని చెబుతున్నారు. ప్రైవేటు ఉద్యోగులకు టీకా తప్పనిసరి నిబంధనల అమలుకు సైతం ఇదే కీలకమని పేర్కొంటున్నారు.
ఆ నిబంధనపై న్యాయపోరాటం
100 మంది కన్నా ఎక్కువ ఉద్యోగులు ఉన్న కంపెనీల్లో వంద శాతం వ్యాక్సినేషన్ ఉండాలన్న నిబంధనను లూసియానాలోని ఫెడరల్ కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే, దీనిపై బైడెన్ ప్రభుత్వం న్యాయపోరాటం చేస్తుందని అధ్యక్షుడి సలహాదారు సర్జన్ జనరల్ వివేక్ మూర్తి తెలిపారు. నిబంధనలు సమంజసంగా లేకపోతే బైడెన్ ప్రభుత్వం వాటిని ప్రవేశపెట్టేదే కాదని అభిప్రాయపడ్డారు.
టీకాలు వేసుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగుల్లో చాలా మంది విముఖత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో... వారిని ఒప్పించడమే బైడెన్ ప్రభుత్వానికి అసలు సవాలుగా మారింది. గతవారం ఇచ్చిన ఆదేశాల ప్రకారం దాదాపు 8.4 కోట్లమంది ప్రైవేటు రంగంలోని ఉద్యోగులు జనవరిలోగా వ్యాక్సిన్ తప్పక తీసుకోవాలి.
అమెరికాలో 22.2 కోట్ల కంటే ఎక్కువమంది ఒక డోసు వ్యాక్సిన్... అందులో 19.3 కోట్ల కంటే ఎక్కువమంది రెండు డోసులు వేసుకున్నారు. టీకాలు వేసుకోని ఉద్యోగులకు.. ముందుగా కౌన్సిలింగ్ ఇచ్చి నచ్చచెప్తారు. అయినా తీసుకోకపోతే 14 రోజులు సస్పెండ్ చేస్తారు. ఆ తర్వాత పూర్తిగా విధుల నుంచి తొలగిస్తారు. అయితే, విధుల నుంచి తొలగించే నిబంధనను ఖండించిన రిపబ్లికన్లు... ప్రభుత్వ నిర్ణయం పౌరుల స్వేచ్ఛను హరించడమేనని ఆరోపిస్తూ అధ్యక్షునికి లేఖ రాశారు.
ఇదీ చదవండి: