ETV Bharat / international

'కరోనాపై విజయానికి చేరువయ్యాం.. కానీ'

కరోనాపై విజయానికి అమెరికా చేరువయ్యిందని అధ్యక్షుడు(America president) జో బైడెన్‌(Joe Biden) వ్యాఖ్యానించారు. అయితే కొవిడ్​ను(Covid-19) పూర్తిగా అధిగమించలేదన్నారు. వైరస్​ రూపాంతరం చెందుతూనే ఉందని పేర్కొన్నారు. దేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మాట్లాడిన బైడెన్​.. వైరస్‌ నుంచి స్వాతంత్ర్యం వచ్చిందనే ఇతివృత్తంతో వేడుకలు జరుపుకోవాలని ప్రజలకు సూచించారు.

Biden
బైడెన్​
author img

By

Published : Jul 5, 2021, 10:58 AM IST

Updated : Jul 5, 2021, 11:56 AM IST

యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాపై(Corona virus) విజయానికి చేరువయ్యామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌(Joe Biden) ప్రకటించారు. ఆదివారం.. అమెరికా స్వాతంత్ర్య వేడుకల(America independence day) దృష్ట్యా శ్వేతసౌధంలో సుమారు వెయ్యి మందికి ఆయన విందు ఇచ్చారు. ఈ సందర్భంగా.. బాణసంచా వెలుగులను ఆయన కుటుంబసభ్యులతో కలిసి తిలకించారు.

కొవిడ్‌ నుంచి క్రమంగా బయటపడుతున్నామని, స్వాతంత్ర్య వేడుకలను అమెరికా ప్రజలంతా ఘనంగా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. వైరస్‌ నుంచి స్వాతంత్ర్యం వచ్చిందనే ఇతివృత్తంతో ఈ వేడుకలు నిర్వహించాలని సూచించారు.

అయితే కొవిడ్‌ను పూర్తిగా అధిగమించలేదని, నిబంధనలను కచ్చితంగా పాటించాలని బైడెన్​ పేర్కొన్నారు. కరోనా రూపాంతరం చెందుతూనే ఉందని గుర్తుచేసిన అమెరికా అధ్యక్షుడు.. డెల్టా వేరియంట్‌ వంటి శక్తిమంతమైనవి పుట్టుకొస్తున్నాయన్నారు. వ్యాక్సిన్‌లు తీసుకోనివారే వైరస్‌ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారని నిపుణులు చెబుతుండగా, ప్రజలంతా ధైర్యంగా ముందుకు రావాలని బైడెన్ సూచించారు.

ఇదీ చూడండి: అమెరికా అధ్యక్షుడి ఐస్​క్రీం సరదాలు

Last Updated : Jul 5, 2021, 11:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.