ETV Bharat / international

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు భారతీయ భాషల్లో ప్రచారం

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతి ఓటర్లు చాలా కీలకం. ఈ విషయాన్ని గుర్తించిన అక్కడి ప్రధాన పార్టీలు.. వీరి మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా.. భారతీయ భాషల్లో ప్రచారం నిర్వహించాలని డెమొక్రాట్​ అభ్యర్థి జో బైడెన్​ బృందం నిర్ణయించింది. భారతీయ అమెరికన్లకు చేరువయ్యేందుకు 14 ప్రాంతీయ భాషల్లో ప్రచారం సాగిస్తామని ప్రకటించింది.

US-BIDEN-HINDI
జో బైడెన్
author img

By

Published : Jul 31, 2020, 12:06 PM IST

భారతీయ అమెరికన్ల మద్దతు కోసం డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ మద్దతుదారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. వారిని ఆకర్షించేందుకు భారతీయ భాషల్లో ప్రచారాలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. భారత్​లోని భాషా వైవిధ్యాన్ని దృష్టిలో పెట్టుకుని 14 భాషల్లో కార్యక్రమాలను రూపొందించనున్నట్లు ప్రకటించారు.

"భారతీయ అమెరికన్లను చేరుకునేందుకు వారి ప్రాంతీయ భాషల్లో ప్రచారం చేసేందుకు ప్రణాళికలు వేస్తున్నాం. హిందీ, పంజాబీ, తమిళ్, తెలుగు, బెంగాలీ, ఉర్దూ, కన్నడ, మలయాళీ, ఒరియా, మరాఠీ సహా మొత్తం 14 భాషల్లో ప్రచారం సాగిస్తాం. భారత్​ ఎన్నికల స్ఫూర్తితో సామాజిక కార్యక్రమాలు, ఆకర్షణీయమైన నినాదాలు, బాలీవుడ్ సంగీతంతో అందరికీ చేరువవుతాం."

- అజయ్ భూటోరియా, బైడెన్ జాతీయ ఫినాన్స్ కమిటీ సభ్యుడు

డెమొక్రాట్లు, రిపబ్లికన్ల పోటీ అధికంగా ఉండే కీలక రాష్ట్రాలే కేంద్రంగా ఈ ప్రచారాన్ని చేపట్టనున్నారు. ఉదాహరణకు.. "అమెరికా కా నేతా కైసా హో, జో బైడెన్​ జైసా హో" అనే నినాదాన్ని ఎంపిక చేసుకున్నారు. "అమెరికా నేత.. జో బైడెన్​లా ఉండాలి" అని దీని అర్థం.

ట్రంప్ 2016లోనే..

అయితే ఈ విషయంలో రిపబ్లికన్లు చాలా ముందు ఉన్నారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లోనే ట్రంప్ రిపబ్లికన్​ పార్టీ హిందీలో ఎన్నికల ప్రచారం నిర్వహించింది. భారత ప్రధాని నరేంద్రమోదీ 2014 ఎన్నికల నినాదం "అబ్​ కి బార్ మోదీ సర్కార్" తరహాలో "అబ్​ కి బార్ ట్రంప్ సర్కార్​" అంటూ ప్రచారం కొనసాగించింది.

ట్రంప్ ప్రారంభించిన నాలుగేళ్ల తర్వాత డెమొక్రాట్లు ఈ వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. అయినప్పటికీ భారతీయులను అమెరికా ఎన్నికల్లో భాగస్వామ్యం చేసేందుకు ఈ డిజిటల్ కార్యక్రమం ఉపయోగపడుతుందని అభిప్రాయపడుతున్నారు.

"భారత ప్రాంతీయ భాషలలో ప్రచార గ్రాఫిక్‌లను సృష్టించాల్సిన అవసరం ఉందని బైడెన్ ప్రచార విభాగం భావించింది. తద్వారా జో బైడెన్‌తో భారతీయ సమాజం అనుబంధం మరింత పెరుగుతుంది. ఉపాధ్యక్షునిగా బైడెన్ తరచూ అమెరికా అభివృద్ధిలో వలసదారుల పాత్రను గుర్తు చేస్తారు. ప్రతి సంస్కృతి, దేశం నుంచి కష్టపడి పనిచేసే ప్రజలను ఆకర్షించటమే దేశ సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుందని బైడెన్ అభిప్రాయం."

- నేహా దివాన్​, బైడెన్ దక్షిణాసియా జాతీయ డైరెక్టర్

ఇదీ చూడండి: 'అమెరికా అధ్యక్షుడిగా గెలిస్తే భారత్​కే అధిక ప్రాధాన్యం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.