ETV Bharat / international

రిపబ్లికన్లూ.. పరిణతితో ఆలోచించండి: బైడెన్​ - joe biden

క్యాపిటల్ అల్లర్ల సందర్భంగా మాస్కులు ధరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన రిపబ్లికన్లపై బైడెన్ మండిపడ్డారు. పరిణతితో ఆలోచించాలని సూచించారు.

joe biden, corona, republican
రిపబ్లికన్లపై మండిపడ్డ బైడెన్​
author img

By

Published : Jan 16, 2021, 7:53 PM IST

అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన జో బైడెన్.. రిపబ్లికన్లపై మండిపడ్డారు. రిపబ్లికన్లకు ఇది పరిణతితో ఆలోచించాల్సిన సమయమన్నారు. జనవరి 6న క్యాపిటల్ అల్లర్ల సందర్భంలో.. మాస్కులు ధరించడానికి వ్యతిరేకించిన రిపబ్లికన్ నేతలపై ఈ విధంగా స్పందించారు. క్యాపిటల్ ఘటన తర్వాత ముగ్గురు డెమొక్రాట్లు సహా మరొకరు కొవిడ్ బారినపడ్డారన్న విషయాన్ని గుర్తుచేశారు.

"మా పార్టీకి చెందిన కాంగ్రెస్ సభ్యురాలు మాస్కులు అందిస్తే వాటిని తిరస్కరించారు. మాస్కు ధరించడం వల్ల మీకు వచ్చిన సమస్య ఏంటి? మీకోసం కాకపోయినా దేశం కోసమైనా మాస్కు ధరించండి. ఇది మీరు పరిణితితో ఆలోచించాల్సిన సమయం. మీరు ఎదగాల్సి ఉంది. మీ నిర్లక్ష్యం కారణంగా నలుగురు కాంగ్రెస్ సభ్యులకు కరోనా సోకింది. వారిలో ఒకరు ఇటీవల క్యాన్సర్​ నుంచి కోలుకున్నారు."

-జో బైడెన్, అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత.​

ఇది రాజకీయం కాదు..

తన వ్యాఖ్యలకు రాజకీయాలతో సంబంధం లేదని బైడెన్ స్పష్టం చేశారు. అధ్యక్ష పదివి చేపట్టగానే మాస్కు తప్పని చేస్తూ ఆదేశాలు జారీ చేస్తానని పునరుద్ఘాటించారు. కలిసికట్టుగా పోరాడితేనే కరోనాను జయించగలమని అన్నారు.

ఇదీ చదవండి : ఎఫ్​బీఐ హెచ్చరిక- బైడెన్​ 'రిహార్సల్'​ వాయిదా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.