ETV Bharat / international

Joe Biden Afghanistan: ప్రస్తుతం ఎవ్వరినీ నమ్మాలనిపించట్లేదు.. - తాలిబన్లపై జో బైడెన్

ఆగస్టు 31 తర్వాత కూడా అప్గాన్(Afghanistan news) నుంచి ప్రజలను తరలించే ప్రక్రియను కొనసాగింపుపై సైనికాధికారులతో చర్చిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden Afghanistan) తెలిపారు. కాబుల్​ విమానాశ్రయం(Kabul airport) చుట్టుపక్కల సురక్షితమైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మరోవైపు.. తాలిబన్లకు నిధులు మంజూరు చేసే అంశం.. వారి వ్యవహార శైలిపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరిని నమ్మేలా లేదని అన్నారు.

joe biden, america president
జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు
author img

By

Published : Aug 23, 2021, 9:19 AM IST

తాలిబన్​ ఆక్రమిత అఫ్గానిస్థాన్(Afghanistan Taliban)​ నుంచి ప్రజలను తరలించే ప్రక్రియ పొడగింపుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 31 తర్వాత కూడా ఈ ప్రక్రియను కొనసాగించడంపై సైనికాధికారులతో చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఆదివారం ఆయన శ్వేతసౌధంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

"అఫ్గాన్​ నుంచి ప్రజల తరలింపు ప్రక్రియను ఆగస్టు 31 తర్వాత కూడా కొనసాగించడంపై అమెరికా సైనికాధికారులతో చర్చలు కొనసాగుతున్నాయి. ఈ ప్రక్రియను ఇంకా మేం పొడగించాల్సిన అవసరం లేదు. కానీ, దీనిపై చర్చలైతే జరుగుతున్నాయి. ఇది ఎంతదూరం వెళ్తుందో నాకు తెలియదు."

-జో బైడెన్​, అమెరికా అధ్యక్షుడు

"అఫ్గాన్​లో పరిస్థితిని ఆసరాగా చేసుకుని అఫ్గాన్​ పౌరులు, అమెరికా బలగాలే లక్ష్యంగా ఉగ్రమూకలు తెగబడే అవకాశం ఉందని మాకు తెలుసు. ఐసిస్​, ఐసిస్​-కె వంటి ఉగ్రసంస్థల నుంచి ఇలాంటి ముప్పు ఎదురుకాకుండా ఉండేందుకు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాం." అని బైడెన్ (Joe Biden Afghanistan) పేర్కొన్నారు. కాబుల్​ విమానాశ్రయం(Kabul airport) చుట్టుపక్కల సురక్షిత వాతావరణం ఉండేలా తాము చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

Biden
జో బైడెన్​

'ఇప్పుడు కాకపోతే.. ఇంకెప్పుడు?'

ఈ తరలింపు ప్రక్రియ.. బాధ, నష్టం లేకుండా సాధ్యం కాదని బైడెన్ చెప్పారు.

"బాధ, నష్టం లేకుండా ఇంత మందిని తరలించేందుకు ఆస్కారం లేదు. హృదయాన్ని కలచివేసేలా కనిపిస్తున్న చిత్రాలన్ని నిజమైనవే. వారి కోసం నేను ఎంతో బాధపడుతున్నాను. అయితే.. మనం ఇప్పుడు కాకపోతే అఫ్గాన్​ నుంచి ఇంకెప్పుడు వెళ్లేది?"

-జో బైడెన్​, అమెరికా అధ్యక్షుడు

తాలిబన్లతో సహా తాను ఎవరినీ విశ్వసించనని బైడెన్ పేర్కొన్నారు. తాలిబన్లకు నిధులు మంజూరు చేసే ప్రక్రియ.. వారి వ్యవహార శైలిపై ఆధారపడి ఉంటుందని బైడెన్ చెప్పారు.

యుద్ధ విమానాల్లో..

1700 మంది ప్రయాణికులతో కాబుల్​లోని​ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఏడు సీ-17 యుద్ధ విమానాలు, ఒక సీ-130 యుద్ధ విమానం బయలుదేరిందని శ్వేతసౌధ కార్యాలయం తెలిపింది. ఇవేగాకుండా మరో 39 యుద్ధ విమానాల్లో 3,400 మంది ప్రయాణికులు బయలుదేరినట్లు చెప్పింది.

ఆగస్టు 14 నుంటి సైనిక విమానాల్లో దాదాపు 30,300 మందిని అఫ్గాన్​ నుంచి తరలించినట్లు శ్వేతసౌద కార్యాలయ అధికారులు తెలిపారు. జులై చివరి నుంచి తరలించిన వారి సంఖ్య దాదాపు 35,500గా ఉన్నట్లు చెప్పారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.