ETV Bharat / international

'ట్రంప్​ మాటల కన్నా.. వారినే నేను నమ్ముతా'​ - అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020

కరోనా వ్యాక్సిన్​ పంపిణీ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ను తాను విశ్వసించలేనని జో బైడెన్​ తెలిపారు. శాస్త్రవేత్తల మాటలే వింటానన్నారు. వ్యాక్సిన్​ సరఫరాపై ఇటీవలి కాలంలో విస్తృతంగా చర్చలు జరుగుతున్న తరుణంలో డెమొక్రటిక్​ అధ్యక్ష అభ్యర్థి ఈ వ్యాఖ్యలు చేశారు.

Biden says he trusts vaccines and scientists, not Trumpg
'ట్రంప్​ మాటల కన్నా.. నేను వారినే నమ్ముకుంటా'​
author img

By

Published : Sep 17, 2020, 9:57 AM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ.. అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​- డెమొక్రటిక్​ అభ్యర్థి జో బైడెన్​ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. తాజాగా.. ట్రంప్​ను లక్ష్యంగా చేసుకుని మరోమారు విమర్శనాస్త్రాలను సంధించారు బైడెన్​. కరోనా వ్యాక్సిన్​ విషయంలో తాను శాస్త్రవేత్తలను విశ్వసిస్తానని.. ట్రంప్​ను మాత్రం నమ్మలేనన్నారు. వ్యాక్సిన్​ పంపిణీపై విస్తృతంగా చర్చలు జరుగుతున్న తరుణంలో బైడెన్​ ఈ వ్యాఖ్యలు చేశారు.

"వ్యాక్సిన్లు, శాస్త్రవేత్తలపై నాను నమ్మకం ఉంది. కానీ డొనాల్డ్​ ట్రంప్​ను మాత్రం నేను విశ్వసించను. నేనే కాదు.. ఈ పరిస్థితుల్లో అమెరికన్లు కూడా ట్రంప్​ను నమ్మలేరు."

-- జో బైడెన్​, డెమొక్రటిక్​ అధ్యక్ష అభ్యర్థి

కరోనా పరీక్షలు, పీపీఈ కిట్ల పంపిణీలో ట్రంప్​ అసమర్థత రుజువైందని.. వ్యాక్సిన్​ సరఫరాలో అమెరికా మరోమారు అలాంటి తప్పులు చేయలేదన్నారు బైడెన్​.

వ్యాక్సిన్​ విషయంపై రిపబ్లికన్లు- డెమొక్రాట్ల మధ్య గత కొంత కాలంగా మాటలు యుద్ధం కొనసాగుతోంది. అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. వ్యాక్సిన్​కు ఆమోదముద్ర వేసే విషయంలో ట్రంప్​ ప్రభుత్వం రాజకీయాలకు పాల్పడవచ్చని డెమొక్రాట్లు ఆరోపిస్తున్నారు. అయితే డెమొక్రాట్లు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని.. ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని రిపబ్లికన్లు మండిపడుతున్నారు.

ఇదీ చూడండి:- 'ట్రంప్​కు మళ్లీ అధికారమిస్తే ప్రకృతి వినాశనమే!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.