అఫ్గానిస్థాన్‌లోని (Afghanistan news) ఐసిస్ స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లతో దాడులు అమెరికా.. మరోసారి తీవ్రవ్యాఖ్యలు చేసింది. ఇస్లామిక్ స్థావరాలపై శనివారం జరిపిన డ్రోన్ దాడులు చివరికి కావని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) స్పష్టం చేశారు. ఆత్మాహుతి దాడిలో తమ పౌరుల ప్రాణాలు బలిగొన్నవారిలో ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తేలేదన్నారు. రాగల 2-3 రోజుల్లో కాబుల్‌లో మరోసారి పేలుళ్లు జరిగే అవకాశం ఉందని.. తనతో సైన్యాధికారులు తెలిపినట్లు పేర్కొన్నారు.
శనివారం ఐఎస్ఎస్-కే ఉగ్రసంస్థ స్థావరాలపై డ్రోన్ దాడి జరిపిన అమెరికన్ దళాలు ఆత్మాహుతి దాడికి సూత్రధారి సహా మరో ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. అంతకుముందు కాబుల్ విమానాశ్రయంలో(Kabul Airport) ఐసిస్ జరిపిన దాడుల్లో మొత్తం 180మందికిపైగా మృతి చెందారు. వీరిలో 13 మంది అమెరికా సైనికులు ఉన్నారు.
ఇదీ చదవండి: US Airstrike: అమెరికా ప్రతీకారం- ఐసిస్ స్థావరాలపై డ్రోన్ దాడులు!