ETV Bharat / international

ఎన్నికల్లో ట్రంప్​ను ఢీకొట్టేది ఆ ఇద్దరిలో ఎవరు? - sanders latest news

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రాథమిక పోరులో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థులు జో బిడెన్, బెర్నీ సాండర్స్ పోటాపోటీగా దూసుకెళ్తున్నారు. అధ్యక్ష పదవికి ట్రంప్​తో పోటీ పడేందుకు నువ్వా నేనా అన్నట్లుగా ముందుకు సాగుతున్నారు. సూపర్​ ట్యూస్​ డే రోజున 15 రాష్ట్రాల్లో జరిగిన పార్టీ అంతర్గత ఎన్నికల్లో సాండర్స్​పై స్వల్ప ఆధిక్యం కనబర్చారు బిడెన్​.

US election 2020
ఎన్నికల్లో ట్రంప్​ను ఢీకొట్టేది ఆ ఇద్దరిలో ఎవరు?
author img

By

Published : Mar 4, 2020, 4:06 PM IST

Updated : Mar 4, 2020, 8:35 PM IST

ఎన్నికల్లో ట్రంప్​ను ఢీకొట్టేది ఆ ఇద్దరిలో ఎవరు?

అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిని ఖరారు చేసేందుకు నిర్వహించే ప్రాథమిక ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ​ తరఫున జో బిడెన్​ ముందంజలో దూసుకెళ్తున్నారు. మొత్తం 15 రాష్ట్రాల్లో నిర్వహించిన 'సూపర్ ట్యూస్ డే' ఎన్నికల్లో బిడెన్ ఆధిక్యం కనబర్చారు. ఆయన తర్వాతి స్థానంలో బెర్నీ సాండర్స్​ ఉన్నారు. అధ్యక్ష పదవి కోసం రేసులో ఉన్న మరో డెమొక్రటిక్ అభ్యర్థి మైకేల్ బ్లూమ్​బర్గ్​కు మాత్రం నిరాశే ఎదురైంది. ఆయన అభ్యర్థిగా నిలిచే అవకాశాలు దాదాపు సన్నగిల్లాయి.

సూపర్​ ట్యూస్​ డే రోజున అలబామా, అర్కన్సాస్​, కాలిఫోర్నియా, కొలరాడో, మైనీ, మస్సాచుసెట్స్​, ఒక్లహామా సహా 15 రాష్ట్రాల్లో ప్రాథమిక ఎన్నికలు జరిగాయి.

డెమొక్రాట్ల తరఫున అధ్యక్ష పదవి రేసులో ఉన్న జో బిడెన్​.. వర్జీనియా, ఉత్తర కాలిఫోర్నియా, అలబామా, ఒక్లామా, టెన్నిస్సీ, మిన్నెసోటా, మస్సాచుసెట్స్​, అర్కాన్సాస్​ రాష్ట్రాల్లో ఘన విజయం సాధించారు.

415 ప్రతినిధులను పంపే అతిపెద్ద రాష్ట్రమైన కాలిఫోర్నియాలో ఆధిక్యం ప్రదర్శించారు బిడెన్​. ట్రంప్​తో పోటీ పడేందుకు తాను ముందున్నానని నిరూపించుకున్నారు. సొంత రాష్ట్రమైన వెర్మోంట్​తో పాటు ఉటా​, కొలొరాడోలో గెలిచారు.

మెయినీ, టెక్సాస్​ రాష్ట్రాల్లో బిడెన్​, సాండర్స్​ పోటాపోటీగా తలపడ్డారు.

వ్యాపార దిగ్గజానికి ఎదురుదెబ్బ

న్యూయార్క్​ మాజీ మేయర్, అధ్యక్ష అభ్యర్థిత్వం రేసులో ఉన్న మరో డెమొక్రాట్ మైకేల్ బ్లూమ్​బర్గ్​ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. సమోవా కాకస్​లో మాత్రమే విజయం సాధించారు.

ఇప్పటి వరకు 500 మిలియన్​ డాలర్లను ప్రచారం కోసం వెచ్చించారు బ్లూమ్​బర్గ్. ప్రాథమిక ఎన్నికల్లో నిరాశాజనక ఫలితాలతో అధ్యక్ష పదవి రేసు నుంచి దాదాపు తప్పుకునే పరిస్థితి ఏర్పడింది.

ట్రంప్ స్పందన..

ఈ ఫలితాలపై అమెరికా అధ్యక్షుడు, రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రాథమిక ఎన్నికల్లో మైకేల్ బ్లూమ్​బర్గ్​ దారుణ పరాజయం చవిచూశారని ట్వీట్​ చేశారు. 700మిలియన్​ డాలర్లు గంగలో కలిసిపోయాయని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. డెమొక్రాట్ల తరఫున బరిలో ఉన్న మరో ఇద్దరు అభ్యర్థులు ఎలిజబెత్​ వారెన్​, పొకాహోంటాస్​ తమ సొంత రాష్ట్రాల్లో కూడా ప్రభావం చూపలేకపోయారని ఎద్దేవా చేశారు ట్రంప్​.

బుష్ వారసుడి పరాభవం..

హ్యూస్టన్​లో సొంత పార్టీ రిపబ్లికన్ల అభ్యర్థులతో పోటీపడిన అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ వారసుడు పీర్స్​బుష్ ఓటమిపాలయ్యారు. ఫలితంగా టెక్సాస్​లో గత 40 ఏళ్లలో తన కుటుంబానికి ఎన్నడూ లేని పరభవాన్ని మూటగట్టుకున్నారు.

ఇదీ చూడండి: తాలిబన్ల దుశ్చర్య- ట్రంప్​తో మాట్లాడిన కాసేపటికే 20 మంది హత్య

Last Updated : Mar 4, 2020, 8:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.