అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక 100 రోజుల్లో 10 కోట్ల మందికి కరోనా టీకా ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమని నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ స్పష్టం చేశారు. ఈ మేరకు కరోనాపై పోరుకు తన ప్రణాళికను బైడెన్ వివరించారు. కరోనా కట్టడిలో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనా వైఫల్యం కారణంగానే అమెరికాపై మహమ్మారి దెబ్బ బలంగా పడిందన్నారు. టీకా తప్ప మరేదీ అమెరికాను కరోనా నుంచి రక్షించలేదని చెప్పారు.
జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్న నేపథ్యంలో.. దేశం ఎదుర్కొంటున్న ఆరోగ్య పరమైన సవాళ్లపై బైడెన్ తన బృందంతో చర్చలు జరిపారు. అమెరికాలో ఇప్పటివరకు 2.35 కోట్ల మంది.. వైరస్ బారిన పడ్డారు. 3.92 లక్షల మందికి పైగా మహమ్మారికి బలయ్యారు.
ఇదీ చూడండి:కమలా హారిస్‌కు మైక్ పెన్స్ అభినందనలు